మనలో చాలామంది కొబ్బరినూనెను జుట్టుకు రాసుకునేందుకు వినియోగిస్తారు. అయితే కొబ్బరి నూనె వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరినూనె శరీర బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ప్రస్తుత కాలంలో చాలామందిని ఊబకాయం సమస్య వేధిస్తోంది. రాత్రి సమయంలో ఆలస్యంగా ఆహారం తీసుకున్నా, జంక్ ఫుడ్, బర్గర్లు ఎక్కువగా తీసుకున్నా బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి.
Also Read: కీర దోసకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజాలివే..?
చాలామంది బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమవుతూ ఉంటారు. అయితే కొబ్బరి నూనె సహాయంతో సులభంగా బరువు తగ్గవచ్చు. కొబ్బరి నూనెతో వంటలు చేస్తారనే సంగతి తెలిసిందే. అయితే వంటల్లో వినియోగించడానికి వాడే ప్రత్యేకమైన కొబ్బరి నూనెను మార్కెట్ లో కొనుగోలు చేయవచ్చు. అరకిలో అన్నం వండితే అందులో పదిహేను గ్రాముల కొబ్బరి నూనెను ఎసరుకు పెట్టిన నీళ్లలో కలపాలి.
Also Read: మద్యం తాగేవాళ్లకు భారీ షాక్.. డీఎన్ఏలో విపరీతమైన మార్పులు..?
అలా వండిన అన్నాన్ని కొంత సమయం ఫ్రిజ్ లో ఉంచి ఆ తరువాత వేడి చేసి తినాలి. ఈ విధంగా చేయడం ద్వారా శరీరంలోని కొవ్వు వేగంగా కరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా వండిన అన్నం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టడంతో పాటు కొంచెం తినగానే కడుపు నిండింది అనే భావన కలిగి కొంచెం తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ విధంగా అన్నం వండుకుని తింటే మంచిది.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
మారుతున్న కాలం వల్ల చాలామంది సరైన సమయానికి ఆహారం తీసుకోలేకపోతున్నారు. పెళ్లికి ముందే అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. బరువు తగ్గడానికి ఇతర చిట్కాలతో పోలిస్తే ఈ విధంగా ప్రయత్నించి బరువు తగ్గితే మంచిది.