సాధారణంగా పెళ్లైన జంట ఒకరు లేదా ఇద్దరు పిల్లలను కనాలని అనుకుంటుంది. అయితే ఒక జంట మాత్రం ఏకంగా 100 మంది పిల్లలను కనాలని భావిస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఆ జంట మాత్రం ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. తన కుటుంబాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో మహిళ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మహిళకు 11 మంది పిల్లలు ఉండగా ఇంకా పిల్లలు కావాలని మహిళ కోరుకుంటూ ఉండటం గమనార్హం.
Also Read: టీవీ, ఫ్రిజ్ ఉన్నవారికి షాక్.. రేషన్ కార్డు రద్దయ్యే ఛాన్స్..?
పూర్తి వివరాల్లోకి వెళితే రష్యా దేశంలోని జార్జియాలో క్రిస్టినా ఓజ్టూర్క్- గల్లిప్ ఓజ్టర్క్ దంపతులు జీవనం సాగిస్తున్నారు. వీరికి కోట్ల రూపాయల విలువ చేసే విలాసవంతమైన సొంత రెస్టారెంట్ ఉంది. అయితే క్రిస్టినా ఓజ్టూర్క్ కు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలపై ఉండే ఇష్టం వల్ల ఏకంగా 100 మంది పిల్లలకు కనాలని ఆమె అనుకుంటోంది. అయితే క్రిస్టినా 11 మంది పిల్లల్లో 10 మంది సరోగసి ద్వారా జన్మించారు.
Also Read: ఎల్‌ఐసీ బెస్ట్ పాలసీ.. రోజుకు రూ.64తో చేతికి రూ.13 లక్షలు..?
ఒక్కో సరోగేట్ మదర్ కు మన దేశ కరెన్సీ ప్రకారం 7 లక్షల రూపాయలు చెల్లించి ఆమె 100 మంది పిల్లలను కనాలనే కోరికను నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారు. త్వరలో తన కోరిక కచ్చితంగా నెరవేరుతుందని ఆ మహిళ భావిస్తున్నారు. జార్జియాలో సరోగసి చట్టబద్ధం కావడంతో పిల్లలంటే అమితమైన ప్రేమ ఉన్న భార్య కోరికను నెరవేర్చడం కొరకు సరోగసి విధానాన్ని ఎంచుకున్నామని గల్లిప్ వెల్లడించారు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
క్రిస్టినా ఓజ్టూర్క్- గల్లిప్ ఓజ్టర్క్ దంపతులు 100 మందికి పిల్లలకు పైగా కనాలని అనుకున్న కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది. ఈ దంపతులు తీసుకున్న నిర్ణయం గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.