Health Tips: రోగనిరోధక శక్తిని పెంచే లవంగాలు.. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ తగ్గేలా?

Health Tips:  ప్రస్తుత పరిస్థితుల్లో ఇమ్యూనిటీ పవర్ ఉంటే మాత్రమే వైరస్ బారిన పడే అవకాశం ఉండదు. దేశంలో రోజుకు 1,80,000 కరోనా కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ కేసులలో 4,000 కేసులు ఒమిక్రాన్ కేసులు కావడం గమనార్హం. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచే లవంగంను తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఉదయాన్నే పరగడుపున లవంగం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. లవంగాలను ఉదయం […]

Written By: Navya, Updated On : January 10, 2022 7:35 pm
Follow us on

Health Tips:  ప్రస్తుత పరిస్థితుల్లో ఇమ్యూనిటీ పవర్ ఉంటే మాత్రమే వైరస్ బారిన పడే అవకాశం ఉండదు. దేశంలో రోజుకు 1,80,000 కరోనా కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ కేసులలో 4,000 కేసులు ఒమిక్రాన్ కేసులు కావడం గమనార్హం. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచే లవంగంను తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

ఉదయాన్నే పరగడుపున లవంగం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. లవంగాలను ఉదయం సమయంలో తీసుకోవడం ద్వారా కీళ్ల నొప్పుల సమస్యలు తగ్గుతాయి. లవంగాలను తీసుకోవడం వల్ల ఎముకలకు మేలు జరుగుతుంది. మాంగనీస్, యూజీనాల్ తో పాటు శరీరానికి ఉపయోగపడే ఫ్లేవనాయిడ్లు సైతం లవంగాలలో పుష్కలంగా ఉండటం గమనార్హం. లివర్ సంబంధిత వ్యాధులతో బాధ పడేవాళ్లు లవంగాలు తీసుకుంటే మంచిది.

జీర్ణ సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు లవంగాలు తీసుకోవడం ద్వారా ఆ సమస్యలకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. జీర్ణక్రియ ప్రక్రియకు ఉపయోగపడే ఎంజైమ్ ల స్రావంను పెంచడంలో లవంగాలు తోడ్పడతాయి. అజీర్ణం, మలబద్ధకం సమస్యలతో బాధ పడేవాళ్లు లవంగాలు తీసుకోవడం ద్వారా ఆ సమస్యలు దూరమయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు.

శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ సి లవంగాల ద్వారా మనకు లభిస్తాయి. లవంగాలు ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా కరోనా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు కూడా తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచే లవంగాలు అనేక ఆరోగ్య సమస్యలను సైతం సులభంగా దూరం చేసే ఛాన్స్ ఉంటుంది.