Silver Cleaning Tips: బంగారం కొనలేని వారు వెండి వస్తువులను ఉపయోగిస్తారు. బంగారం కంటే వెండి ధర తక్కువగా ఉండడంతోపాటు వీటితో తయారైన వస్తువులను కొనుగోలు చేస్తారు. పూజ గది నుంచి కాళ్ల పట్టీల వరకు వెండివే ఎక్కువగా ఉంటాయి. అయితే తరుచూ వీటిని వాడడం వల్ల అవి నల్లబడిపోతాయి. దీంతో చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండవు.దీంతో చాలా మంది మెరుగ పెట్టకోవడానికి జ్యవెల్లరీ షాపులక తీసుకెళ్తుంటారు. మరికొందరు మెరుగు పెట్టే వ్యక్తుల వద్ద వీటిపై ఉన్న మురికి పోగొట్టేలా చేస్తారు. అయితే ఇంట్లో ఉండే పదార్థాలతో వీటిని మెరుగు పెట్టుకోవచ్చు. అదెలాగో చూద్దాం..
ఒక కప్పులో వస్తువులకు సరిపడేంత నిమ్మరసాన్ని తీసుకోవాలి. ఇందులో కొంచెం బేకింగ్ సోడాను కలుపుకోవాలి. ఈ నీటిలో వెండి వస్తువులను వేయాలి. 15 నుంచి 30 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి. ఆ తరువాత బ్రష్ తో వాటిని శుభ్రం చేసుకోవాలి. ఇక నిమ్మరసం లేని వారు బేకింగ్ సోడాతో కూడా వెండి వస్తువులను శుభ్రం చేసుకోచ్చు. అయితే నిమ్మరసం అవసరం లేకుండా బేకింగ్ సోడాలో వెనిగర్ వేయాలి. ఈ మిశ్రమంలో వెండి వస్తువులను ఉంచిన తరువాత శుభ్రం చేసుకోవడంతో ఫలితం ఉంటుంది.
టూత్ పేస్ట్ ద్వారా కూడా వెండి వస్తువులను తళతళలాడేలా చేయొచ్చు. ముందుగా వెండి సామానుకు టూత్ పేస్ట్ ను అద్దివ్వాలి. అలా అప్లయ్ చేసిన తరువాత 20నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తరువాత టూత్ బ్రష్ ను ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. వెండి వస్తువులు కొన్ని చిన్నవిగా ఉంటాయి. వీటిని కాస్త జాగ్రత్తగా బ్రష్ సహాయంతో శుభ్రం చేస్తూ వాటిని మురికిని పోగొట్టవచ్చు. పైవేవీ అందుబాటులో లేనప్పుడు సబ్బునురగలో కాసేపు ఉంచి బ్రష్ తో కూడా శుభ్రం చేసుకోవచ్చు.