https://oktelugu.com/

Allu Arjun National Award: అల్లు అర్జున్ కి అవార్డు వస్తే మహేష్ బాబు బాధపడాలా?

సుకుమార్ కథను ఓకే చేసి పుష్ప చిత్రం చేసి ఉంటే... మహేష్ పాన్ ఇండియా హీరో అయ్యేవాడు. నేషనల్ అవార్డు గెలిచేవాడనే విశ్లేషణ మొదలుపెట్టారు. అయితే ఇది వంద శాతం తప్పు. మహేష్-సుకుమార్ మూవీ చేయాలని అనుకున్నప్పుడు ఫస్ట్ తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధిన ఓ కథ అనుకున్నారు.

Written By:
  • Shiva
  • , Updated On : August 25, 2023 / 04:52 PM IST

    Allu Arjun National Award

    Follow us on

    Allu Arjun National Award: చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఓ హీరో రిజెక్ట్ చేసిన సినిమా హిట్ అయితే అతడు దురదృష్టవంతుడు, మంచి మూవీ కోల్పోయాడని అంటారు. అదే మూవీ ప్లాప్ అయితే తెలివిగా తప్పించుకున్నాడు. మూవీని రిజెక్ట్ చేసి గొప్ప నిర్ణయం తీసుకున్నాడని అంటారు. ఇదే సూత్రాన్ని నేషనల్ అవార్డుకి ఆపాదించి కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. పుష్ప మూవీ ఆఫర్ మొదట మహేష్ వద్దకు పోగా ఆయన రిజెక్ట్ చేశాడు. మహేష్ చేయను అనడంతో ఆ కథను అల్లు అర్జున్ తో చేసి సుకుమార్ హిట్ కొట్టాడు. పుష్ప మూవీలో నటించిన అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో అయ్యాడు.

    తాజాగా నేషనల్ అవార్డు కొల్లగొట్టాడు. పుష్పరాజ్ అనే ఎర్ర చందనం స్మగ్లర్ రోల్ చేసిన అల్లు అర్జున్ గొప్ప నటన కనబరిచి జాతీయ అవార్డు అందుకున్నారు. ఇది ఇంత వరకు ఏ తెలుగు హీరోకి దక్కని గౌరవం. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గెలిచిన మొదటి టాలీవుడ్ హీరోగా అల్లు అర్జున్ అవతరించాడు. ఈ క్రమంలో ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. పుష్ప చిత్రాన్ని రిజెక్ట్ చేసిన మహేష్ నేషనల్ అవార్డు అందుకునే ఛాన్స్ కోల్పోయారని అంటున్నారు.

    సుకుమార్ కథను ఓకే చేసి పుష్ప చిత్రం చేసి ఉంటే… మహేష్ పాన్ ఇండియా హీరో అయ్యేవాడు. నేషనల్ అవార్డు గెలిచేవాడనే విశ్లేషణ మొదలుపెట్టారు. అయితే ఇది వంద శాతం తప్పు. మహేష్-సుకుమార్ మూవీ చేయాలని అనుకున్నప్పుడు ఫస్ట్ తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధిన ఓ కథ అనుకున్నారు. అది కాదని ఎర్ర చందనం స్మగ్లింగ్ పాయింట్ ని మహేష్ కి వినిపించాడు. దీని మీద కొన్నాళ్ళు కథా చర్చలు నడిచాయి.

    మహేష్ ఎందుకో సంతృప్తి చెందలేదు. సుకుమార్ ని పక్కన పెట్టేశాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించాడు. సామరస్యపూర్వకంగా మహేష్, సుకుమార్ ప్రాజెక్ట్ ఆగిపోయింది. మహేష్ సుకుమార్ కి నెక్స్ట్ ప్రాజెక్ట్ కి బెస్ట్ విషెస్ చెప్పాడు. మహేష్ కి చెప్పిన కథలో మార్పులు చేసి అల్లు అర్జున్ తో పుష్ప తెరకెక్కించి సుకుమార్ సక్సెస్ అయ్యాడు. నేపథ్యం ఒకటే అయినా.. మహేష్ కి చెప్పిన కథ వేరు. ఆయన్ని పోలీస్ గా చూపించాలని సుకుమార్ అనుకున్నారట.

    ఇక మహేష్ తో అయితే ఆయన డీ గ్లామర్ లుక్ ట్రై చేసేవాడు కాదు. మహేష్ ససేమిరా ఒప్పుకునేవారు కాదు. పుష్పరాజ్ గా అల్లు అర్జున్ మురికి బట్టలు, గడ్డం, జుట్టు, గూనెతో నటించి జ్యూరీ మెంబర్స్ ని మెప్పించి నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఒకవేళ పుష్పలో మహేష్ పోలీసుగా నటించినా లేదా స్మగ్లర్ రోల్ చేసినా… సినిమా ఫలితం ఏమిటో తెలియదు. ఎందుకంటే ఒక హీరోకి సెట్ అయిన కథ మరో హీరోకి సెట్ కాదు. అసలు మహేష్ ఈ ప్రాజెక్ట్ చేస్తే సక్సెస్ అయ్యేదో లేదో కూడా తెలియదు.

    భరత్ అనే నేను వంటి ఒక పొలిటికల్ డ్రామా అల్లు అర్జున్ కి సెట్ కాకపోవచ్చు… కాబట్టి పుష్ప చిత్రాన్ని రిజెక్ట్ చేసిన మహేష్ నేషనల్ అవార్డు పొందే ఛాన్స్ కోల్పోయాడనే వాదన నిరర్ధకం. ఆ విషయం మహేష్ కి బాగా తెలుసు. ఆయన గెలిచిన వారిని అభినందిస్తాడే కానీ కచ్చితంగా బాధపడడు అని చెప్పొచ్చు…