Cinnamon Benefits: ప్రస్తుతం చాలా మందికి ఏదో ఒక వ్యాధి, సమస్యలు వస్తున్నాయి. ఆరోగ్యం పరంగా చూస్తే ఎక్కువ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కానీ తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే చాలా సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. ఇంటి కిచన్ లోనే ఆరోగ్యాన్ని కాపాడే ఇంగ్రీడియన్స్ చాలా ఉంటాయి. వాటి గురించి తెలుసుకొని ఉపయోగించడం వల్ల చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చు. పసుపు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో తెలిసిందే. ఇదే విధంగా చాలా పదార్థాలు మీకు ఉపయోగపడతాయి. అందులో ఒకటి దాల్చిన చెక్క.
బిర్యానీ, మసాలా వంటకాల్లో ఉపయోగించే దినుసుల్లో దాల్చిన చెక్క ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన ఈ. దాల్చిన చెక్కతో రుచికరమైన ఆహారమే కాకుండా.. ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కిచెన్ హ్యాక్స్ కింద కూడా ఈ దాల్చిన చెక్కను ఉపయోగించవచ్చట. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటితో చాలా రకాల అనారోగ్య సమస్యలు నయం అవుతాయట. మరి అవేంటో కూడా ఓ సారి చూసేద్దాం.
దాల్చిన చెక్క వాతం వ్యాధులను నయం చేస్తుంది. దీని పొడిని గోరు వెచ్చటి నీటిలో కలిపి తాగాలి. ఈ నీటిని తాగడం వల్ల కడుపులో ఉండే వాతం తగ్గుతుందట. దాల్చి చెక్క రసాన్ని లేదా పొడిని ప్రతి రోజూ చిటికెడు తీసుకున్నా శరీరంలో చేరిన నీరు తొలగి పోతుంది అంటున్నారు నిపుణులు.
మైగ్రేన్ తలనొప్పికి దాల్చిన చెక్కతో చెక్ పెట్టవచ్చు. చిన్న దాల్చిన చెక్క ముక్కను నోట్లో పెట్టుకుని చప్పరించాలి. దీనివల్ల స్వర పేటిక వాపు, గొంతు బొంగురు పోవడం వంటి సమస్యలను ఇది దూరం చేస్తుంది. ఇక పీరియడ్స్ సమయంలో ఆడువారిలో వచ్చే సమస్యల్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఈ మసాలా దినుసు. దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల రక్త హీనత వల్ల బాధ పడేవారు ఉపశమనం పొందుతారు. జీర్ణ వ్యవస్థ, దంతాలు, నోటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. దాల్చిన చెక్క ఆయిల్ వల్ల కళ్ల సమస్యలు కూడా తొలుగుతాయి. ఇందుకోసం కళ్లను మూసి రాయడం వల్ల కళ్ల నొప్పులు, వాపు తగ్గుతాయి.
ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క పొడి, గంధం పొడి, గులాబీ నీటిలో కలిపి ముఖానికి రాసుకుంటే చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గుతాయి. అంతేకాదు రంగు పెరుగుతుంది. దాల్చిన చెక్క పొడిలో నిమ్మరసం కలిపి ఫేస్ ప్యాక్‌లా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి అంటున్నారు నిపుణులు.
దాల్చిన చెక్కలోని ఔషధగుణాలు, తేనెలోని ఔషధ గుణాలు కలిస్తే అపరసంజీవని అనుకోవాల్సిందే. స్త్రీలకు గుండెజబ్బులు రాకుండా చేస్తుంది. అంతేకాదు కండరాల వాపును కూడా నయం చేస్తుంది ఈ సుగంధ ద్రవ్యం. గ్రాము దాల్చిన చెక్క పొడిని, తగినంత తేనెలో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు.
ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని ఒకే తెలుగు నిర్ధారించదు.