Gabbar Singh: వరుస ఫ్లాప్స్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కెరీర్ లో ‘గబ్బర్ సింగ్’ అనే సినిమా సృష్టించిన సునామి ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టాలీవుడ్ కింగ్ కం బ్యాక్ ఇస్తే ఎలాంటి రికార్డ్స్ వస్తాయో, అలాంటి రికార్డ్స్ ని గబ్బర్ సింగ్ చిత్రం నెలకొల్పింది. అప్పట్లో మగధీర రికార్డ్స్ ఎలాంటివంటే, ప్రస్తుతం బాహుబలి రికార్డ్స్ ఎలాగో అలా అన్నమాట. అలాంటి రోజుల్లో మగధీర రికార్డ్స్ ఒక్క సీడెడ్ , నెల్లూరు లో తప్ప అన్నీ ప్రాంతాలలో బద్దలు కొట్టిన మొట్టమొదటి హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆరోజుల్లోనే ఆయన ఈ సినిమాతో 63 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాడు. ఈ రికార్డుని అప్పట్లో ఒక్క స్టార్ హీరో కూడా ముట్టుకోలేకపోయారు.
బాహుబలి చిత్రం వరకు చెక్కు చెదరకుండా గబ్బర్ సింగ్ రికార్డ్స్ పదిలంగా ఉండేవి. ఇప్పటికీ కూడా మన టాలీవుడ్ కొంతమంది స్టార్ హీరోలు గబ్బర్ సింగ్ నైజాం ప్రాంతం లో సృష్టించిన రికార్డ్స్ ని ముట్టుకోలేకపోయారు. ఇప్పుడు ఈ చిత్రం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈ రీ రిలీజ్ పై అభిమానుల్లో ప్రేక్షకుల్లో క్రేజ్ మామూలు రేంజ్ లో లేదు. రీ రిలీజ్ లో కూడా ఈ చిత్రం ఆల్ టైం రికార్డ్స్ ని బద్దలు కొడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈ చిత్రం గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మేము మీ ముందు ఉంచబోతున్నాము. ఈ సినిమాలో విలన్ గా అభిమన్యు సింగ్ నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. గతం లో ఆయన హిందీ లో పలు చిత్రాలు చేసాడు. తెలుగు లో రక్త చరిత్ర వంటి సూపర్ హిట్ చిత్రం లో నటించాడు. అయితే హరీష్ శంకర్ ఈయనని విలన్ గా తీసుకునే ముందు ఒక ప్రముఖ హీరో ని విలన్ తీసుకోవాలని అప్పట్లో తెగ ప్రయత్నం చేసాడట. ఆ హీరో మరెవరో కాదు అబ్బాస్.
ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న ఈయన, ఆ తర్వాత కొన్ని ఫ్లాప్ సినిమాల కారణంగా మార్కెట్ మొత్తం పోగొట్టుకొని సెకండ్ హీరో గా చాలా సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఈయన నితిన్ హీరో గా నటించిన ‘మారో’ అనే చిత్రం ద్వారా విలన్ గా తొలిసారి వెండితెర మీద కనిపించాడు. ఈ చిత్రం లో ఆయన నటన చూసి ఆకర్షితుడైన హరీష్ శంకర్, గబ్బర్ సింగ్ చిత్రం లో విలన్ రోల్ కి పర్ఫెక్ట్ గా సరిపోతాడని అతన్ని సంప్రదించే ప్రయత్నం చేసాడు. కానీ అప్పటికే ఆయన సినిమాలు పూర్తి మానేసి విదేశాల్లో స్థిరపడ్డాడు. హరీష్ శంకర్ రిక్వెస్ట్ చేసినా కూడా ఒప్పుకోలేదు. అలా ఈ పాత్ర ఆయనకీ మిస్ అయ్యింది. ఒకవేళ అబ్బాస్ ఒప్పుకొని ఆ పాత్ర చేసుంటే ఈరోజు ఆయన రేంజ్ వేరేలా ఉండేది. ఇప్పుడు ఆయన త్వరలో ప్రారంభం కాబోతున్న ‘బిగ్ బాస్ 8 ‘ ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి.