Chicken : ఆ మధ్య తమిళనాడులో ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు వేడి చేసి, ముందు రోజు వండిన చికెన్ కూర తిని ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తమిళనాడులోని అరియలూరులో చోటుచేసుకుంది. అరియలూరు జిల్లా జయంగొండం సమీపంలోని గ్రామానికి చెందిన గోవిందరాజు, అన్బరసి దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఘటన జరిగిన రోజు గోవిందరాజు తాను నిర్మిస్తున్న కొత్త ఇంటికి శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్లి వచ్చిన తర్వాత కోడి కూరను ఇంట్లో వండుకున్నారు. మిగిలిన చికెన్ పులుసును ఫ్రిజ్ లో ఉంచి మరుసటి రోజు తిన్నారు. ఆ సమయంలో ఏడో తరగతి చదువుతున్న వారి చిన్న కూతురు లిథిర పాత కూర గ్రేవీ తిని అస్వస్థతకు గురైంది. వెంటనే వారిని జయంగొండం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. అదేవిధంగా నాసిరకం కోడి కూర తిన్న తండ్రి గోవిందరాజులు, తల్లి అన్బరసి, సోదరి ద్వారక కూడా అనారోగ్య కారణాలతో జయంగొండం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందారు.
చికెన్‌తో వండిన ఆహారాన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. బిర్యానీ నుంచి తందూరీ వరకు ఎన్నో రకాల ఆహారపదార్థాలు దీనితోనే వండుతారు. దీని రుచి, సువాసన మనకు చాలా ఇష్టపడేలా చేస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట చికెన్ వంటకాలు తినేందుకు వెళ్లే వారి సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువైంది. అయితే, అవి ఎంత మంచివని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చాలా రెస్టారెంట్లు మరుసటి రోజు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన చికెన్‌ను ఉపయోగిస్తాయి. ఆ విషయంలో ఇది ఎంత వరకు సురక్షితం ? ఆహార నాణ్యతా నిబంధనల ప్రకారం, ఈ రకం వండిన చికెన్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేసి, ఆపై తినడం వల్ల వివిధ దుష్ప్రభావాలు సంభవిస్తాయి. ప్రాణాపాయం కూడా ఉంటుందని వారు అంటున్నారు. కాబట్టి, మీరు తినే చికెన్ తినడానికి సురక్షితమైనదా లేదా చెడిపోయిందా అని తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.
చికెన్‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే చికెన్ తినేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. కొందరు రోజూ నాన్ వెజ్ తింటారు. అలా తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నా పెద్దగా పట్టించుకోరు. అంతేకాదు రోజూ బయటకు వెళ్లి తెచ్చుకోవడం కష్టమని ఫ్రిజ్ లో దాచి పెడుతున్నారు. ఫ్రిజ్ లో చికెన్ తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకు కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు. దానిని ఒకసారి పరిశీలిద్దాం. చికెన్‌ని ఫ్రిజ్‌లో నిల్వ చేయడం ఎప్పటి నుంచో ఉన్న విషయం. ఎందుకంటే దానిలో నిల్వ చేయడం చాలా సులభం, సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే చికెన్‌ని ఫ్రిజ్‌లో ఉంచవచ్చా.. లేదా? ఇది ఎంతకాలం సురక్షితంగా ఉంటుంది వంటి విషయాల గురించి మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా? ఇప్పుడు తెలుసుకోండి..
చికెన్ ఉడకకపోతే రెండు రోజుల పాటు ఫ్రిజ్ లో ఉంచవచ్చని చెబుతున్నారు. అదేవిధంగా వండితే నాలుగు రోజులు ఉంచవచ్చని.. 4 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద బ్యాక్టీరియా నెమ్మదిగా వృద్ధి చెందుతుందని చెబుతున్నారు. కాబట్టి చికెన్‌ని ఫ్రిజ్‌లో నిల్వ చేయడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి మందగిస్తుంది. చికెన్‌ను గాలి చొరబడని డబ్బాలో ఉంచి ఫ్రిజ్‌లో పెడితే ఇంకా మంచిది. కూరను కూడా ఇలాగే నిల్వ చేసుకోవచ్చు. అది బూడిద లేదా ఆకుపచ్చగా మారితే, చికెన్ చెడిపోయిందని గుర్తుంచుకోవాలి. వెంటనే దాన్ని పారివేయడం మంచింది.