Manchu Vishnu and Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోలు చాలా మంది ఉన్నారు. అయితే సీనియర్ హీరోల్లో మోహన్ బాబు తనదైన రీతులో సత్తా చాటుకోవడమే కాకుండా 500 లకు పైన సినిమాలను చేసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. మరి అలాంటి మోహన్ బాబు ప్రస్తుతం కొన్ని సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు లాంటి నటుడికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఆయన కొడుకుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచి విష్ణు వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఈయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే కాకుండా ఆయనకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడంలో ఆయన కొంతవరకు వెనుకబట్టడనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాల్లో ఢీ సినిమాను మినహాయిస్తే మిగిలిన ఏ సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు. దాంతో ఆయన ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు ఒక్క సక్సెస్ కొట్టడానికే ఆయన నానా తంటాలు పడుతున్నాడనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం విష్ణు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. కన్నప్ప సినిమా ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ నంది పాత్రలో కనిపిస్తున్న విషయం మనకు తెలిసిందే. ముందుగా ప్రభాస్ తో శివుడి పాత్రని చేయించాలనుకున్నారు. కానీ ప్రభాస్ దానికి ఒప్పుకోకపోవడంతో కనీసం నంది పాత్ర అయినా పర్లేదు అని చెప్పి అతని చేత నంది పాత్రను చేయిస్తున్నారు.
మరి ఈ సినిమాలో ప్రభాస్ ఎంతవరకు హెల్ప్ అవుతాడు. అలాగే ఈ సినిమా ప్రభాస్ కి ఎంతలా హెల్ప్ అవ్వబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికైతే ఈ సినిమా మొత్తం ప్రభాస్ మీద డిపెండ్ అయి నడవబోతుంది. దానివల్లే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరుపుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ఈ సినిమాలో ఎంతసేపు కనిపించినా కూడా ఈ సినిమా అతనికి హెల్ప్ అయితే అవ్వదు. కానీ ఈ సినిమా వల్ల మంచు విష్ణు కి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే అవుతుంది. తద్వారా ఆయన సినిమాకి మార్కెట్లో మంచి గుర్తింపు రావడమే కాకుండా పాన్ ఇండియాలో కూడా కొంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా మంచు విష్ణు ఈ సినిమా ఆడితేనే సినిమా ఇండస్ట్రీలో ఉంటాడు లేకపోతే మాత్రం ఆయన ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. కాబట్టి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందిస్తుంది అనేది తెలియాల్సి ఉంది…