Health Tips: మనలో చాలామందిని జీవనశైలి వల్ల వేధించే ఆరోగ్య సమస్యలలో బీపీ, షుగర్ ముందువరసలో ఉంటాయి. వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని ఈ ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. శారీరక శ్రమకు దూరంగా ఉండేవాళ్లు ఎక్కువగా ఈ వ్యాధుల బారిన పడుతున్నారని సమాచారం అందుతోంది. అయితే కొన్ని ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల ఈ వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.
వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే మూలకం వల్ల ప్యాంక్రియాస్‌ను ప్రేరేపించడంతో పాటు షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచడం సాధ్యమవుతుంది. శరీరంలో రక్తం కొరతను తీర్చడంలో బీట్ రూట్ ఎంతగానో ఉపయోగపడుతుందనే సంగతి తెలిసిందే. బీట్ రూట్ లో ఉండే ఫోలేట్ రక్తనాళాలను దెబ్బ తినకుండా రక్షిస్తుంది. డయాబెటిక్ రోగులు బీట్ రూట్ తింటే ఇందులోని చక్కెర సహజమైన గ్లూకోజ్ గా మారి ఉపయోగపడుతుంది.
బీట్ రూట్ లో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. అధిక బీపీ, మధుమేహంలను అదుపులో ఉంచడంలో నేరేడు పండ్లు తోడ్పడతాయి. నేరేడు పండ్లు తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరిగే ఛాన్స్ ఉంటుంది. గుండెపోటు, ఇతర వ్యాధుల నుంచి రక్షించడంలో నేరేడుపండ్లు ఉపయోగపడతాయి. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఈ పండ్లను తీసుకోవచ్చు.