Arrest Warrant On MLA Roja Husband: వైసీపీ ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణిపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. ప్రముఖ డైరెక్టర్, దక్షిణ భారత చలన చిత్ర కార్మికుల సమ్మేళనం అధ్యక్షుడు అయిన సెల్వమణిపై చెన్నై జార్జిటౌన్ కోర్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. సెల్వమణి గతంలో చేసిన ఓ తప్పిదం వల్లే ఇంత దూరం వచ్చిందని సమాచారం.
డైరెక్టర్ సెల్వమణి గతంలో ఎక్కువగా రాజకీయ పరమైన చర్చలకు, అలాగే ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారు. ఈ క్రమంలోనే 2016లో సెల్వమణితో పాటు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుళ్ అన్భరసు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ క్రమంలోనే వారిద్దరూ అనేక విషయాలపై చర్చిస్తుండగా.. ఓ వ్యక్తి గురించి కూడా మాట్లాడారు.
ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోద్రా గురించి కూడా వారిద్దరి మధ్య చర్చకు వచ్చింది. కాగా ఈ సమయంలో వారిద్దరూ అతనిపై కొన్ని అభ్యంతరకర అభిప్రాయాలు వెల్లడించారు. దీంతో ముకుంద్ చంద్ వారిద్దరిపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణ జరుగుతుండగానే ముకుంద్ చంద్ మరణించారు. అనంతరం ఆయన కొడుకు గగన్ బోద్రా ఈ కేసును కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలోనే చెన్నై జార్జిటౌన్ కోర్టులో మంగళవారం ఈ కేసు విచారణకు వచ్చింది. కానీ సెల్వమణితో పాటు అరుళ్ అన్బరసు కూడా విచారణకు రాలేదు. వారి తరఫున లాయర్లు కూడా హాజరు కాలేదు. దీంతో కోర్టు సీరియస్ అయి.. వారిద్దరిపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. అసలే రోజు మంత్రి కాబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆమెకు భర్త అరెస్ట్ వారెంట్ ఏమైనా ఇబ్బందిగా మారుతుందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి సెల్వమణి అరెస్ట్ చేసేదాకా చూస్తారా లేదంటే స్వచ్ఛందంగా వెళ్లి వివరణ ఇచ్చుకుంటారా అన్నది చూడాలి.
Also Read:Praja Sangrama Padayatra: ప్రజాసంగ్రామ యాత్రతో టీఆర్ఎస్ కు బీజేపీ చెక్ పెట్టనుందా?