
భారతదేశంలో 80శాతం మంది ప్రతిరోజు వరిబియ్యంతో తయారైన అన్నాన్నే ఆరగిస్తుంటారు. ఈ అన్నంలోకి తమకు ఇష్టమైన కూరలను వండి తింటుంటారు. అయితే అన్నం తినడంపై చాలా మందికి చాలా రకాలు అపోహలున్నాయి.
Also Read: పది పెళ్లిళ్లు చేసుకున్న మహిళ.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే..?
*రాత్రి పూట హెవీ అయిన అన్నం తినడానికి బదులు చాలా మంది చపాతీ, టిఫిన్ లాంటివి తింటుంటారు. వీటికంటే అన్నం తినడమే చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే అన్నం తినడం వల్ల చక్కగా నిద్ర పడుతుందని తాజా పరిశోధనలో తేలింది. అన్నం తినడం వల్ల లెప్టిన్ అనే హార్మోన్ విడుదలవుతుందట.. ఇది మన శరీరంలో బాగా శక్తిని ఖర్చు చేస్తుందట.. కొవ్వు పేరుకుపోకుండా చేస్తుందట.. దీంతోపాటు ఆకలి వేయకుండా ఉంచుతుంది. కనుక రాత్రి పూట నిర్భయంగా అన్నం తినవచ్చు.
*ముఖ్యంగా దేశంలో చక్కెర వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు. వీరంతా రాత్రిళ్లు అన్నం మానేసి చపాతీలు, వివిధ రకాల జొన్నె రొట్టెలు తింటుటారు. నిజానికి మధుమేహం ఉన్న వారు నిర్భయంగా అన్నం తినవచ్చని తాజాగా పరిశోధకులు తేల్చారు.
*తక్కువ మోతాదులో అన్నం తినడంతోపాటు దాంట్లో పప్పులు, కూరగాయలు, నెయ్యి వంటి ఆహారాలను తీసుకుంటే భోజనం చేసిన వెంటనే షుగర్ స్థాయిలు పెరగకుండా ఉంటాయి. ఇలా డయాబెటిస్ ఉన్న వారు కూడా అన్నం తిన్నట్టయితే చక్కెర నిల్వల స్థాయిని నియంత్రణలో ఉంచుతాయని చెబుతున్నారు.
Also Read: టిఫిన్ తిని స్నానం చేస్తున్నారా.. ఆ ఆరోగ్య సమస్యల బారిన పడినట్టే..?
*అన్నం తినడం వల్ల శరీరంలో కొవ్వు చేరదు. నిత్యం మనం జంక్ ఫుడ్, నూనె పదార్థాలు, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాలతో శరీరంలో కొవ్వు పెరుగుతుంది. దీన్ని నివారించాలంటే అన్నం ఆరగీంచడమే ఉత్తమమని తేల్చారు.