https://oktelugu.com/

Body dangerous for the heart: శరీరంలో ఈ మార్పులు.. గుండెకు ప్రమాదమా?

కొందరికి అలసట, బలహీనం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇవి సాధారణ సమస్యలే అనుకుంటే పొరపాటే. ఈ సమస్యలను పరిష్కరించుకోకపోతే.. గుండె ప్రమాదంలో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిత్యం అలసటగా ఉంటే మాత్రం వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. అలాగే కొందరికి కాళ్లు, మోకాళ్లు, చీలమండలో వాపు కనిపిస్తుంది

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 5, 2024 / 02:00 AM IST

    Heart-changes

    Follow us on

    Body dangerous for the heart: ప్రస్తుతం మారిన జీవన శైలి, తీసుకునే ఆహారం వల్ల చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ ఎక్కువగా గుండె ప్రమాదాల బారిన పడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది గుండె పోటుతో మరణిస్తున్నారు. ప్రస్తుతం అయితే గుండె పోటు మరణాలు అధికంగా ఉన్నాయి. ఎలాంటి లక్షణాలు లేకుండా గుండె పోటు వచ్చి ఒక్కసారిగా చనిపోతున్నారు. అయితే గుండె పోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు ఇస్తుందని, కాకపోతే వాటిని పెద్దగా మనం పట్టించుకోమని నిపుణులు అంటున్నారు. గుండె పోటు వచ్చే ముందు కొన్ని లక్షణాల ద్వారా గుండె ఆరోగ్యంగా ఉందో లేదో చెప్పవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. మరి తెలుసుకోవడం ఎలాగో చూద్దాం.

    కొందరికి అలసట, బలహీనం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇవి సాధారణ సమస్యలే అనుకుంటే పొరపాటే. ఈ సమస్యలను పరిష్కరించుకోకపోతే.. గుండె ప్రమాదంలో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిత్యం అలసటగా ఉంటే మాత్రం వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. అలాగే కొందరికి కాళ్లు, మోకాళ్లు, చీలమండలో వాపు కనిపిస్తుంది. ఇలా వాపు చిన్నగా వచ్చిన కూడా గుండె బలహీనంగా మారిందని అర్థం చేసుకోవాలి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలి. లేకపోతే సమస్య చేజారిపోతుంది. సాధారణంగా కాకుండా వేగంగా గుండె కొట్టుకుంటే కాస్త జాగ్రత్త పడాల్సిందే. గుండె ప్రమాదాలు వచ్చే ముందు కొందరిలో శ్వాస సంబంధిత సమస్యలు కనిపిస్తాయి. విపరీతంగా దగ్గు, గురక ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు దీర్ఘకాలికంగా ఉంటే గుండెకు ప్రమాదం. ఈ లక్షణాలు కనిపించిన తర్వాత వైద్యుని సంప్రదించాలి. లేకపోతే గుండెపోటు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    గుండె పోటు బారిన పడకుండా ఉండాలంటే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పోషకాలు ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. ముఖ్యంగా డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండే పండ్లు, తాజా కూరగాయలను తీసుకోవాలి. వేయించిన పదార్థాలు, జంక్ ఫుడ్స్, మద్యం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే తృణ ధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఫైబర్, పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి రక్తంలో కొవ్వు స్థాయిని తగ్గించి, గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే లీన్, చేపలు, గుడ్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటివి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. సోడియం ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటివల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరానికి ఆరోగ్యమైన కొవ్వులు ఇచ్చే పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. అనారోగ్య కొవ్వులు ఇచ్చే బర్గర్, మసాలా ఫుడ్స్, ఫ్రెంచ్ ఫ్రై వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటిని అధికంగా తినడం వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.