https://oktelugu.com/

Pinarayi Vijayan : కేరళలో అవినీతి తారాస్థాయికి.. సీఎంనే సూత్రధారి

ఇక సీపీఎం ప్రభుత్వంలోని మంత్రి జయరాజ్ ఆరోపణలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అసలు సీపీఎం పార్టీ ఎక్కడికి వెళుతోంది. ఇవన్నీ వేళ్లు కేరళ సీఎం పినరయి విజయన్ వైపు చూపిస్తున్నాయి..

Written By:
  • NARESH
  • , Updated On : July 1, 2023 / 06:46 PM IST
    Follow us on

    Pinarayi Vijayan : కమ్యూనిస్టు పార్టీ అని చెప్పుకునే సీపీఎం ఇంత దారుణమైన అవినీతి ఆరోపణలు ఇంతకుముందు ఏ కమ్యూనిస్టు ప్రభుత్వంపై రాలేదు. వాళ్ల పార్టీ మీద వాళ్ల పార్టీ వాళ్లే ఆరోపించారు.

    ఎస్ఎఫ్ఐ లీడర్ నిఖిల్ థామస్ పరీక్షకు హాజరు కాకుండానే రూ.2 లక్షలు చెల్లించేసి ఏకంగా సర్టిఫికెట్ తెచ్చేసుకున్నాడు. పాస్ అయినట్టుగా చేసుకున్నాడు.

    దానికంటే ఇంకా వింత ఏంటంటే.. దేశాభిమాని అనే ఎప్పటి నుంచో ఉన్న సీపీఎం పత్రిక. దానికి అసోసియేట్ ఎడిటర్ గా చేసిన శక్తిధరణ్ తాజాగా దారుణమైన ఆరోపణలు చేశారు. కొచ్చిన్ నుంచి రెండు కోట్లకు పైగా డబ్బులు తిరువనంతపురం ఒక కారులో తరలించారు. ఆ డబ్బులు లెక్కించే టప్పుడు నేనూ, ఓ సీపీఎం నాయకుడూ ఉన్నాడని చెప్పుకొచ్చాడు. చాలా తీవ్రమైన ఆరోపణ ఇదీ..

    కోవలం హోటల్ లో రెండు పెద్ద నోట్ల కట్టల సంచులు తీసుకొచ్చి ఆ సదురు సీపీఎం నాయకుడికి ఇచ్చాడని సంచలన ఆరోపణలు ఈ అసోసియేట్ ఎడిటర్ చేశారు..

    ఇక సీపీఎం ప్రభుత్వంలోని మంత్రి జయరాజ్ ఆరోపణలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అసలు సీపీఎం పార్టీ ఎక్కడికి వెళుతోంది. ఇవన్నీ వేళ్లు కేరళ సీఎం పినరయి విజయన్ వైపు చూపిస్తున్నాయి..

    కేరళలో పరిణామాలపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు…