https://oktelugu.com/

Chanakya Neeti : చాణక్య నీతి: ఏ విషయాలు రహస్యంగా ఉంచాలో తెలుసా?

దేశ ప్రయోజనాలకు హాని కలిగించే విషయాలు అసలు బయట పెట్టకూడదు. దీని వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. చాణక్యుడి ప్రకారం ఇలా మనం చాలా విషయాల్లో గోప్యత పాటిస్తేనే మంచిది.

Written By:
  • Srinivas
  • , Updated On : June 18, 2023 / 08:15 AM IST
    Follow us on

    Chanakya Neeti : ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో ఎన్నో విషయాలు బోధించాడు. జీవితంలో మన రహస్యాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి చెప్పకూడదని సూచించాడు. అలా చెబితే ఏదో ఒక సందర్భంలో మనం వారికి దొరికిపోవడం జరుగుతుంది. అందుకే మన వ్యక్తిగత విషయాలు ఇతరులకు చెప్పడం సమంజసం కాదు. ఏ పరిస్థితుల్లో కూడా మన రహస్యాలు పంచుకోవడం అంత మంచిది కాదు. ఇలా చేస్తే మనకు సమస్యలు చుట్టుముట్టే సూచనలు ఉంటాయి.

    ప్రణాళికలు

    ఏదైనా పని చేసేందుకు మనం ప్రణాళికలు రూపొందించుకుంటాం. వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట పెట్టకూడదు. అలా చేస్తే మన గుట్టు తెలుసుకుని ఎదుటి వారు లబ్ధిపొందడమే కాకుండా మనతో పోటీకి నిలిచే అవకాశముంటుంది. మన వ్యూహాలు బహిర్గతం కాకుండా చూసుకోవడమే బెటర్. మన రహస్యాలు తెలిసిన వారు మనల్ని బ్లాక్ మెయిల్ చేసే ప్రమాదం కూడా ఉంటుంది.

    త్యాగాలు

    మానవ సంబంధాలు బలపడాలంటే త్యాగాలు చేయక తప్పదు. బంధాలు బలంగా ఉండాలంటే సర్దుకుపోయే తత్వం కూడా ఉండాలి. అవి లేని వారితో మనం జాగ్రత్తగా ఉండాలి. అనురాగం, ఆప్యాయత, ప్రేమ పెరగాలంటే ఇద్దరి మధ్య అన్యోన్యత పెరగాలి. అప్పుడే అవి మంచి ఫలితాలు ఇస్తాయి. ఇలా మనం మన బంధాలను నిలుపుకోవడానికి చర్యలు తీసుకోక తప్పదు.

    బలహీనతలు

    మన బలహీనతలు కూడా బయట పెట్టడం సురక్షితం కాదు. ఇతరుల దగ్గర మన బలహీనతలు బయట పెడితే కూడా చులకన అయిపోతాం. మన ప్రమాదాన్ని మనమే కొని తెచ్చుకున్నట్లు. మన బలహీనతలు బహిర్గతం చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో వారి మాటలకు మనం లొంగిపోవాల్సి వస్తుంది. స్వార్థం కోసం కొందరు మన బలహీనతలను ఉపయోగించుకుంటారు.

    రాజకీయాలు

    రాజకీయ విషయాలు గోప్యంగా ఉంచాలి. అందరికి చెప్పేవి అయితేనే ప్రచారం చేయాలి. మన స్వ విషయాలైతే ప్రచారం చేయకూడదు. రహస్యంగానే కొనసాగించాలి. దేశ ప్రయోజనాలకు హాని కలిగించే విషయాలు అసలు బయట పెట్టకూడదు. దీని వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. చాణక్యుడి ప్రకారం ఇలా మనం చాలా విషయాల్లో గోప్యత పాటిస్తేనే మంచిది.