Aadipurush : ఆదిపురుష్’ నెగటివ్ రివ్యూస్ ని తొలగిస్తే ఊహించని డబ్బులు ఇస్తామని బ్రతిమిలాడుకుంటున్న మేకర్స్!

వేలాది మంది ఫాలోయర్స్ ఉన్న ట్విట్టర్ హ్యాండిల్స్ నెగటివ్ రివ్యూస్ వేస్తె, వాళ్లకి వ్యక్తిగతంగా మెసేజి చేసి, దయచేసి నెగటివ్ రివ్యూస్ ని తొలగించండి. మీరు వేసిన ఒక్కో నెగటివ్ ట్వీట్ ని తొలగించినందుకు గాను ఒక్కో ట్వీట్ కి 9500 రూపాయిలు ఇస్తాము అని చెప్తున్నారట.

Written By: Vicky, Updated On : June 18, 2023 8:23 am
Follow us on

Aadipurush : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ తెలుగులో ఉన్న వెబ్ సైట్స్ మాత్రం ఈ చిత్రానికి రివ్యూస్ పరంగా పాజిటివ్ గానే ఇచ్చాయి.కానీ హిందీ లో మాత్రం ఈ చిత్రానికి దారుణమైన రేటింగ్స్ ఇచ్చారు, తరన్ ఆదర్శ్ లాంటి ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ కూడా ఈ చిత్రానికి కేవలం ఒక్క స్టార్ మాత్రమే రేటింగ్ ఇచ్చాడు.

సినిమా ఆ రేంజ్ లో అయితే అసలు లేదు, చూసిన ప్రతీ ఒక్కరు ఈ విషయాన్నీ చెప్పగలరు, కానీ బాలీవుడ్ వైపు నెగటివ్ రివ్యూస్ మాత్రం వరదలాగా ప్రవహించింది. కానీ తెలుగు లో కంటే కూడా హిందీ లోనే ఎక్కువ వసూళ్లు రావడం మరో విశేషం. ఇంత నెగటివ్ రివ్యూస్ మధ్య ఈ రేంజ్ ట్రెండ్ చూపించడం అనేది సాధారణమైన విషయం కాదు.

కానీ ఆదిపురుష్ టీం మాత్రం సోషల్ మీడియా లో ఉన్న నెగటివ్ ట్వీట్స్ మరియు నెగటివ్ రివ్యూస్ ని తొలగించడానికి ఒక్క పెద్ద ప్లాన్ తోనే వచ్చింది.  వేలాది మంది ఫాలోయర్స్ ఉన్న ట్విట్టర్ హ్యాండిల్స్ నెగటివ్ రివ్యూస్ వేస్తె, వాళ్లకి వ్యక్తిగతంగా మెసేజి చేసి, దయచేసి నెగటివ్ రివ్యూస్ ని తొలగించండి. మీరు వేసిన ఒక్కో నెగటివ్ ట్వీట్ ని తొలగించినందుకు గాను ఒక్కో ట్వీట్ కి 9500 రూపాయిలు ఇస్తాము అని చెప్తున్నారట.

నిమో యాదవ్ అనే బాలీవుడ్ క్రిటిక్ కి అలా ఆదిపురుష్ మూవీ టీం తనకి మెసేజి చెయ్యగా దానిని స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్ లో అప్లోడ్ చేసాడు నిమో యాదవ్. ప్రస్తుతం ఈ విషయం పై సోషల్ మీడియా లో ట్రోలింగ్స్ మామూలు రేంజ్ లో జరగడం లేదు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఈ విషయం పైనే ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి.