https://oktelugu.com/

Chaitra Amavasya: రేపే శని అమావాస్య.. ఈ తప్పులు చేయొద్దు.. అసలేం చేయాలంటే?

Chaitra Amavasya:  2022 సంవత్సరంలో మొదటి సూర్య గ్రహణానికి వేలైంది. రేపు శనివారం ఏప్రిల్ 30న వైశాఖ అమావాస్య రోజున ఈ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. చైత్ర అమావాస్య రోజు ఇది రావడంతో దీన్నో విశేషంగా పరిగణిస్తున్నారు. అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో పాక్షికంగానే కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఈ సూర్య గ్రహణం ఏప్రిల్ 30న మధ్యాహ్నం 12.15 గంటలకు మొదలవుతుంది. మరుసటి రోజు మే 1 ఉదయం 4.07 గంటలకు ముగుస్తుంది. ఇది అతిపెద్ద సూర్య గ్రహణంగా […]

Written By:
  • NARESH
  • , Updated On : April 29, 2022 / 09:46 PM IST
    Follow us on

    Chaitra Amavasya:  2022 సంవత్సరంలో మొదటి సూర్య గ్రహణానికి వేలైంది. రేపు శనివారం ఏప్రిల్ 30న వైశాఖ అమావాస్య రోజున ఈ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. చైత్ర అమావాస్య రోజు ఇది రావడంతో దీన్నో విశేషంగా పరిగణిస్తున్నారు. అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో పాక్షికంగానే కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

    ఈ సూర్య గ్రహణం ఏప్రిల్ 30న మధ్యాహ్నం 12.15 గంటలకు మొదలవుతుంది. మరుసటి రోజు మే 1 ఉదయం 4.07 గంటలకు ముగుస్తుంది. ఇది అతిపెద్ద సూర్య గ్రహణంగా చెబుతున్నారు.

    సూర్యగ్రహణం రావడంతో గర్భిణులు, బాలింతలు సహా కొంత మంది హైఅలెర్ట్ అయ్యారు. ఇంటినుంచి బయటకు రావద్దని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఈరోజున ఏ నియమాలు పాటించాలో జ్యోతిష్య, వాస్తు శాస్త్ర నిపుణులు సలహాలు ఇస్తున్నారు.

    సూర్యగ్రహణం సందర్భంగా ఆలయాలు మూసేస్తున్నారు. ఈరోజే చైత్ర అమావాస్య కూడా రావడంతో ఇదో పెద్ద సూర్యగ్రహణంగా చెబుతున్నారు. పితృదోషం పోగొట్టుకోవడానికి ఇది ఎంతో విశిష్టమైన రోజుగా పరిగణిస్తున్నారు.

    ఇక అమావాస్య రోజు సూర్యగ్రహణం రావడంతో ఉదయాన్నే నదీస్నానం చేసి దానధర్మాలు చేయాలని సూచిస్తున్నారు.పితృదోషం ఉన్న వారికి పనుల్లో ఆటంకాలు ఏర్పడుతాయి. అందుకే ఈరోజున పరిహారాలు చేసుకుంటారు. ఈరోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టి మరికొంత భాగం కాకి, ఆవుకు పెుడితే పితృదోషం పోతుందని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.

    సూర్యగ్రహణం సమయంలో మహిళలు బయటకు వెళ్లకుండా ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉండాలి. గ్రహణ సమయంలో కూరగాయలు తరగకూడదు. గర్భిణి మహిళలు బయటకు రాకూడదు.. పడుకోకూడదు. గ్రహణం అయిపోయిన తర్వాత స్నానం చేయాలి.. ఆ సమయంలో మహిళలు దేవతల విగ్రహాలకు పెట్టుకోకూడదు. మద్యం, మాంసం ముట్టుకోకూడదు. ఇలా పాటించకపోతే మీ సమస్యలు పెరుగుతాయి.

    చైత్ర అమావాస్యనాడు గ్రహణంతో ఈరోజు మంత్రాలు జపించాలి. లేదంటే దేవుడి నామస్మరణ చేసుకోవాలి. శనివారం రావడంతో శనిదేవుడి ఆలయంలో నువ్వుల నూనె దీపం పెట్టడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు ఆంజనేయుడిని పూజిస్తే ఆయన శక్తి లభిస్తుందని.. శని నుంచి విముక్తి లభిస్తుంది. లక్ష్మీ దేవిని పూజిస్తే మీకు అశ్వైర్యం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

    Recommended Videos: