Carrot soup : క్యారెట్ సూప్ వల్ల అందం, ఆరోగ్యం.. మరి ఎలా చేయాలంటే?

క్యారెట్ సూప్. రెగ్యులర్ సూప్‌లా కాకుండా కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. అందులోనూ క్యారెట్ కాబట్టి.. ఆరోగ్యానికి, అందానికి చాలా మంచిది అంటున్నారు నిపుణులు. ఈ సూప్ ని తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. మరి ఇంత రుచిగా ఉండే సూప్‌ని ఎలా తయారు చేస్తారు అనుకుంటున్నారా?

Written By: Swathi Chilukuri, Updated On : October 13, 2024 9:25 pm

Carrot soup

Follow us on

Carrot soup : క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ ఉదయం క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది. జ్యూస్ మాత్రమే కాదు క్యారెట్‌తో సూప్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ సూప్ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్లీ మళ్లీ చేసుకోవాలి అనిపించేంత రుచిగా ఉంటుంది ఈ సూప్. రెగ్యులర్ సూప్‌లా కాకుండా కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. అందులోనూ క్యారెట్ కాబట్టి.. ఆరోగ్యానికి, అందానికి చాలా మంచిది అంటున్నారు నిపుణులు. ఈ సూప్ ని తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. మరి ఇంత రుచిగా ఉండే సూప్‌ని ఎలా తయారు చేస్తారు అనుకుంటున్నారా?

కావాల్సిన పదార్థాలు: క్యారెట్లు, వెల్లుల్లి, బటర్, ఆయిల్, ఉప్పు, ఉల్లిపాయ తరుగు, పచ్చి మిర్చి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కూరగాయలు ఉడికించిన నీళ్లు, మిరియాల పొడి.

సూప్ తయారీ: ముందుగా క్యారెట్‌ శుభ్రంగా కడిగాలి. ఆయిల్ రాసి బేకింగ్ షీట్‌లో పెట్టి బేక్ చేసుకోవాలి. లేదంటే స్టవ్ మీద కూడా చిన్న మంట మీద కాల్చుకోవచ్చు. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ కొద్దిగా, బటర్ కొద్దిగా వేసి ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు వెల్లుల్లి తరుగు, వేసి ఫ్రై చేయండి. వేగిన తర్వాత ఉప్పు, జీరా పొడి, ధనియా పొడి వేసి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రెండు కప్పుల నీళ్లు వేసుకోండి.

కూరగాయలు ఉడికించిన నీళ్లు వేసుకున్నా మంచిదే. ఆ తర్వాత ముందుగా రోస్ట్ చేసుకున్న క్యారెట్‌ను తురిమి ముద్దగా చేసి.. మరుగుతున్న నీటిలో ఉడికించుకోవాలి. ఇలా నేరుగా తాగాలి అనుకునేవారు తాగేయవచ్చు. లేదు అన్నవాళ్లు స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో వేసి చిక్కని పేస్టులా చేయాలి. చివరలో కొద్దిగా బటర్, నిమ్మరసం వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే క్యారెట్ సూప్ మీ కోసం రెడీ అయినట్టే.

క్యారెట్ తో ప్రయోజనాలు
పచ్చి క్యారెట్ ప్రయోజనాలు: వట్టి క్యారెట్ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇది రుచికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బరువు తగ్గడం నుంచి ఆరోగ్యకరమైన కంటి చూపు వరకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది క్యారెట్. పొటాషియం, విటమిన్ ఎ, బయోటిన్, విటమిన్ బి6, విటమిన్ కె1 వంటి ఖనిజాలు క్యారెట్ లో ఉంటాయి. అంతేకాదు విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. రక్తపోటును తగ్గించడం, కంటి చూపును పదును పెట్టడం, ప్రోటీన్‌ను పెంచడం, శక్తిని పెంచడం వంటి ప్రయోజనాలతో పాటు ఎముకలను బలోపేతం చేస్తుంది క్యారెట్.

100 గ్రా ఎర్ర క్యారెట్‌లో 38 గ్రా కిలో కేలరీలు, 0.5 గ్రా కొవ్వు, 5 గ్రా ఫైబర్, 7 mg విటమిన్ సి, 6.7 గ్రా కార్బోహైడ్రేట్లు, 1 గ్రా ప్రోటీన్, 451 mcg విటమిన్ A మరియు 2706 mcg బీటా కెరోటిన్ ఉన్నాయి. ఈ క్యారెట్ తీపి, రుచి మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది అంటున్నారు నిపుణులు. ఎందుకంటే క్యారెట్ షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుతుందట.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు..