https://oktelugu.com/

Face Beauty Tips: జస్ట్ వేపాకు చాలు మీ ముఖం మచ్చలు లేకుండా మెరుస్తుంది..

అమ్మాయిల్లో చర్మ సమస్యలు ఎక్కువగా ఎండ కారణంగా తలెత్తుతుంటాయి. మొటిమలు, వృద్ధాప్య సంకేతాలు, మెలస్మా, హార్మోన్ల మార్పులు, గాయాలు వంటి వివిధ కారణాల వల్ల ఎదురవుతుంటాయి. ప్రస్తుత ఆహారం, జీవనశైలి కూడా చర్మ సమస్యలకు ఒక కారణం అంటున్నారు నిపుణులు. మరి ముఖ ముడతలు, నల్ల మచ్చలను తగ్గించడానికి ఎలాంటి ఫేస్ ప్యాక్ ను ఉపయోగించాలో తెలుసుకుందామా?

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 14, 2024 / 02:29 AM IST

    Face Beauty Tips

    Follow us on

    Face Beauty Tips : అందమైన ముఖం మీద నల్ల మచ్చలు, మొటిమలు వంటివి ఇబ్బంది పెడుతున్నాయా? ముఖంపై ఉన్న ముడతలు, నల్లమచ్చలను దాచుకోవడానికి క్లెన్సర్, ఫౌండేషన్ ఎక్కువగా ఉపయోగించాల్సిన పరిస్థితి చాలా మందికి వచ్చింది కదా. మీరు కూడా అదే సమస్యతో బాధ పడితే టెన్షన్ తీసుకోవద్దు. మీ ఇబ్బందులను దూరం చేసే మీకు ఉపయోగకరమైన ఫేస్ మాస్క్ గురించి ఇక్కడ తెలుసుకుందాం… ఇంట్లో, ఇంటి చుట్టూ లభించే వస్తువులతో తయారు చేసుకునే ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని యవ్వనంగా, అందంగా మార్చేస్తుంది.. ఇది ఎలాంటి రసాయన ఉత్పత్తుల ప్రభావాలను మీపై కలిగించదు. ప్రతి మహిళ కూడా మచ్చలేని స్కిన్ ను కోరుకుంటుంది. అయితే ప్రస్తుతం చిన్నవయసులోనే చాలా మందిలో అనేక చర్మ సమస్యలు ఎదురవుతున్నాయి.

    అమ్మాయిల్లో చర్మ సమస్యలు ఎక్కువగా ఎండ కారణంగా తలెత్తుతుంటాయి. మొటిమలు, వృద్ధాప్య సంకేతాలు, మెలస్మా, హార్మోన్ల మార్పులు, గాయాలు వంటి వివిధ కారణాల వల్ల ఎదురవుతుంటాయి. ప్రస్తుత ఆహారం, జీవనశైలి కూడా చర్మ సమస్యలకు ఒక కారణం అంటున్నారు నిపుణులు. మరి ముఖ ముడతలు, నల్ల మచ్చలను తగ్గించడానికి ఎలాంటి ఫేస్ ప్యాక్ ను ఉపయోగించాలో తెలుసుకుందామా?

    వేప మాస్క్ ముఖంపై నల్ల మచ్చలు, ముడతలను తొలగించడంలో చాలా సహాయం చేస్తుంది. ముడతలు లేని, స్పష్టమైన, మచ్చలు లేని చర్మం కావాలంటే, వేప ఆయిల్‌తో ఫేస్ మాస్క్ వేసుకోవడం మంచిది. ఆయుర్వేదంలో వేపకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఇది శక్తివంతమైన యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది ముఖంపై మొటిమలను తగ్గిస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్‌లను కూడా అనేక విధాలుగా దూరం చేస్తుంది. వేపలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మ కణాలను రక్షిస్తాయి. అలాగే, ఇది మెలనిన్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. వేప ఫేస్ ప్యాక్‌లను రెగ్యులర్‌గా అప్లై చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే మంచి ఫలితాలను చూడవచ్చు. మరి ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

    అవసరమైన పదార్థాలు..

    వేప ఆకులు – ½ కప్పు, నీరు – 1 నుంచి 2 tsp లేదా అవసరమైనంత, పసుపు పొడి – ½ tsp

    వేప ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి..ఎలా ఉపయోగించాలి..

    1. వేప ఆకులు, నీరు వేసి మెత్తగా రుబ్బాలి. 2. సిద్ధం చేసిన పేస్ట్‌లో కొంత పసుపు ను కలపాలి. ఆ తర్వాత ఫేస్ కు అప్లై చేయాలి.

    3. సుమారు 20 నుంచి 25 నిమిషాల పాటు ఆరనివ్వాలి.

    4. తర్వాత మీ ముఖాన్ని సాధారణ నీటితో కడగాలి.

    చర్మ సమస్యలు దూరమవుతాయి..

    ఈ ఎఫెక్టివ్ ఫేస్ ప్యాక్‌ని వారానికి రెండు సార్లు అప్లై చేస్తే చర్మ సమస్యల నుంచి బయటపడవచ్చు. ముఖంపై నల్లటి వలయాలు, ముడతలు సమస్యను తగ్గించుకోవచ్చు. కానీ మీకు వేప కారణంగా ఏదైనా అలెర్జీ ఉంటే మాత్రం జాగ్రత్త.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు..