Homeఅంతర్జాతీయంUS Trade Deal With Bangladesh: బంగ్లాదేశ్ తో ట్రేడ్ డీల్.. అమెరికా చావుదెబ్బ తీసిందిగా..

US Trade Deal With Bangladesh: బంగ్లాదేశ్ తో ట్రేడ్ డీల్.. అమెరికా చావుదెబ్బ తీసిందిగా..

US Trade Deal With Bangladesh: అగ్రరాజ్యం అమెరికాతో ఏడాది చర్చల తర్వాత భారత్‌ మధ్యంతర వాణిజ్య ఒప్పందం జరిగింది. దీంతో మనకు లాభమని కేంద్రం చెబుతోంది. ఇరు దేశాలు లాభపడేలా అగ్రిమెంట్‌ ఉందని అమెరికా అంటోంది. మోదీ భరత మాతను అమెరికాకు అమ్మేశారని రాహుల్‌గాంధీ అంటున్నారు. మరోవైపు అగ్రిమెంట్‌లోని కొన్ని అంశాలపై దేశంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి తరుణంలో అమెరికా తొండాట మొదలు పెట్టింది. మనతో ఒప్పందం పూర్తికాగానే బంగ్లాదేశ్‌తో రహస్య ఒప్పందం చేసుకుంది. దీంతో ఇప్పుడు మన టెక్సటైల్స్‌పై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.

టెక్స్‌టైల్స్‌ ఎగుమతి ర్యాంకింగ్‌లు
ప్రపంచంలో టెక్స్‌టైల్స్‌ ఎగుమతిలో చైనా ఆధిపత్యం కొనసాగుతోంది. ఏటా 260 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులు ఎగుమతి చేస్తుంది. బంగ్లాదేశ్‌ 48 బిలియడాలర్లు ఎగుమతి చేస్తుంది. వియత్నాం, టర్కీ కూడా 40 బిలియన్‌డాలర్ల ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నాయి. ఇక భారత్‌ కేవలం 36 బిలియన్‌డాలర్ల ఉత్పత్తులు ఎగుమతి చేస్తుంది. అయితే తాజాగా అమెరికాతో బంగ్లాదేశ్‌ చేసుకున్న ఒప్పందంతో భారత ఉత్పత్తులపై ప్రభావం పడే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌ ఉత్పత్తులపై జీరో టారిఫ్‌ ఉంటుందని అమెరికా ప్రకటించింది. మన ఉత్పత్తులపై 18 శాతం టారిఫ్‌ ఉంటుంది.

బంగ్లాదేశ్‌ డీల్‌ షరతులు..
మహ్మద్‌ యూనస్‌ ఒత్తిడితో జీరో టారిఫ్‌కు అమెరికా అంగీకరించింది. కానీ అనేక కండీషన్లు విధించింది. అమెరికా కాటన్‌ కొంటేనే జీరో టారిఫ్‌ ఉంటుందని స్పష్టం చేసింది. ఇక ఫాం ఉత్పత్తులు, కెమికల్స్, మోటార్‌ పార్ట్స్‌ దిగుమతి చేయాలని షరతులు పెట్టింది. డేటా షేరింగ్, ఐపీ రైట్స్‌ ఫ్రీ యాక్సెస్‌తో బంగ్లా ఆధారపడితే దీర్ఘకాలిక నష్టం.

భారత్‌ డీల్‌ రక్షణాత్మక వ్యూహం
భారత్‌ అగ్రికల్చర్‌ ఉత్పత్తులు (పండ్లు, యానిమల్‌ ఫీడ్‌) పరిమితంగా అనుమతించింది. 500 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తుల దిగుమతి కండీషన్‌ను వ్యతిరేకించింది. దీంతో దానిని సవరించింది. ఇక మన ఫార్మ ఉత్పత్తును టారిఫ్‌ లేకుండా కొంటామని అమెరికా తెలిపింది. అయితే రైతుల ప్రభావం నివారించేందుకు ఇంతకాలం డీల్‌ చేసుకోలేదు. కానీ తాజా ఒప్పందంలో కొన్ని పండ్లను దిగుమతి చేసుకోవడానికి భారత్‌ అంగీకరించింది.

రైతులు, పరిశ్రమలపై ప్రభావం
భారత్‌ టెక్స్‌టైల్స్‌ ఎగుమతులు పెరిగి ఉద్యోగాలు సృష్టించవచ్చు. బంగ్లాదేశ్‌లో అమెరికా షరతులు ధరలు పెంచి పోటీశక్తి తగ్గించవచ్చు. భారత రైతులకు పండ్ల దిగుమతి ఆందోళన కలిగించవచ్చు. దీర్ఘకాలంలో భారత్‌ వ్యూహం గెలిచే అవకాశం.

ఆసియా ఐక్యత లోపం..
భారత్, చైనా, పాక్, బంగ్లా మధ్య ఐక్యత లేకపోవడం అమెరికాకు వ్యూహాధిక్యం. ఒక్కో దేశంతో విడివిడిగా డీల్స్‌ చేస్తూ ప్రయోజనం పొందుతోంది. ఐక్యత ఉంటే ఆసియా దేశాలు బలమైన షరతులు వేసేవి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version