Wisdom Teeth : చిన్న వయస్సులో దంతాలు రావడం, ఊడిపోవడం వంటివి జరుగుతుంటాయి. అప్పుడు పెద్దగా నొప్పి కూడా తెలీదు. చిన్నతనంలో పోయిన దంతాలు మళ్లీ వచ్చేస్తాయి. అయితే కొందరికి జ్ఞాన దంతాలు వస్తాయి. కానీ వీటిని తొలగించాలని కొందరు ప్రయత్నిస్తారు. అయితే మనలో చాలా మందికి జ్ఞాన దంతాలు అంటే ఏంటో తెలీదు. ఇవి ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. చాలా మంది వీటిని అదృష్టం అని కూడా అనుకుంటారు. అయితే మరి ఇందులో నిజమేంతో తెలీదు. ఇంతకీ ఈ జ్ఞాన దంతాలు అంటే ఏమిటి? వీటిని తొలగించవచ్చా? తొలగిస్తే ఏమవుతుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
జ్ఞాన దంతాలు అంటే ఏమిటి?
సాధారణంగా దంతాలు చిన్నప్పటి నుంచి వస్తుంటాయి. అయితే మొదట వచ్చిన పాల దంతాలు ఉడిపోయి మళ్లీ వస్తాయి. ఈ దంతాలు కాకుండా 17 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు వచ్చే దంతాలను జ్ఞాన దంతాలు అంటారు. ఇవి వచ్చినప్పుడు కొందరికి చిగుళ్లు నొప్పులు వస్తాయి. ఆ దంతం దగ్గర ఏదయినా ఆహారం ఉండిపోయిన దవడ దగ్గర ఎక్కువగా నొప్పి వస్తుంది. దీంతో కొందరు ఈ జ్ఞాన దంతాలను తొలగించాలని అనుకుంటారు. కానీ వీటిని తొలగించవచ్చా? లేదా? తొలగిస్తే ఏమవుతుందని సందేహపడుతుంటారు. అయితే జ్ఞాన దంతాలను తొలగించవచ్చు. కాకపోతే వీటిని తొలగించినప్పుడు చాలా నొప్పిగా ఉంటుంది. జ్ఞాన దంతాలు ఉన్న దగ్గర చాలా మందికి ఆహారం ఇరుక్కుంటుంది. దీనిని వెంటనే తొలగించాలి. లేకపోతే జ్ఞాన దంతంతో పాటు దాని పక్కన ఉన్న దంతం కూడా పుచ్ఛి పోతుంది. కాబట్టి వెంటనే డాక్టర్ ను సంప్రదించి వీటిని తొలగించాలి.
చాలా మందికి నోరు పొడిబారుతుంది. దవడలు నొప్పిగా ఉంటాయి. కనీసం ఆహారం కూడా మింగలేరు. మాట్లాడుతుంటే నాలుక పొడిగా ఉంటుంది. అయితే ఇవి ఎక్కువగా డయాబెటీస్ ఉన్న వాళ్లకి వస్తుందని నిపుణులు అంటున్నారు. క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నవాళ్లు మందులు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా నోరు పొడిబారుతుంది. కాబట్టి నీరు ఎక్కువగా తాగుతుండాలి. నోరు ఆరకుండా కొంచెం కొంచెం నీరు తాగుతుండాలి. మద్యం, ధుమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. చక్కెర లేని చూయింగ్ గమ్ లను కూడా నమలవచ్చు. దీనివల్ల నోరు ఎక్కువ సేపు అరకుండా ఉంటుంది. దీనివల్ల చాలా మందికి కారం ఏదయినా తింటే మంట కూడా వస్తుంది. కాబట్టి జ్ఞాన దంతాలు వచ్చిన వెంటనే తీసేయాలి. లేకపోతే వీటి వల్ల దంత క్షయం వస్తుంది. దంతాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఫుడ్ విషయంలో ఇబ్బంది పడతారు. సరిగ్గా తినలేరు.