కరోనా లక్షణాలు ఉన్నాయా..తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?

దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. తక్కువ కరోనా లక్షణాలు ఉన్నవాళ్లు హోమ్ ఐసోలేషన్ లోనే ఉండి చికిత్స చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. రోగుల సంఖ్య పెరుగుతుండటంతో వైద్యులు, వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే కరోనా సోకి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న చాలామందికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియడం లేదు. కరోనా సోకిన […]

Written By: Navya, Updated On : April 10, 2021 2:40 pm
Follow us on

దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. తక్కువ కరోనా లక్షణాలు ఉన్నవాళ్లు హోమ్ ఐసోలేషన్ లోనే ఉండి చికిత్స చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. రోగుల సంఖ్య పెరుగుతుండటంతో వైద్యులు, వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది.

అయితే కరోనా సోకి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న చాలామందికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియడం లేదు. కరోనా సోకిన వాళ్లు గదిలో చక్కగా గాలి, వెలుతురు తగిలే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడంతో బ్లూ టూత్, ఇంటర్నెట్ ను ఆన్ లో ఉంచుకోవాలి. గదిలో ఉన్న సమయంలో మాస్క్ ధరించకపోయినా గది నుంచి బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.

హ్యాండ్ క‌ర్చీఫ్ లేదా టిష్యూలను దగ్గే, తుమ్మే సమయంలో ఉపయోగించాలి. చల్లనీటికి బదులుగా గోరువెచ్చని నీటిని ఎక్కువగా తీసుకుంటే మంచిది. వాడిన క‌ర్చీఫ్‌, టిష్యూ, దుస్తులను ఇంటి బయట కాల్చేస్తే మంచిది. క్లాత్ ను ఉపయోగించి తడి చేతులను తుడుచుకోకూడదు. పొగ తాగే అలవాటు ఉన్నవాళ్లు ఆ అలవాటుకు దూరంగా ఉండాలి. ఇంటిని శుభ్రం చేయడానికి బ్లీచింగ్ పౌడ‌ర్ లేదా డిస్ ఇన్ఫెక్టెంట్‌ల‌ను ఉపయోగించాలి.

పొగ తాగే అలవాటు ఉంటే వైరస్, శ్వాసకోశ సమస్యల బారిన పడకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. వాడిన దుస్తులను అరగంట పాటు వేడి నీటిలో ఉంచి ఆ తరువాత ఉతకాలి