https://oktelugu.com/

వకీల్ సాబ్ బీభత్సం: అమెరికాలో కలెక్షన్ల వర్షం

థియేటర్లపై పవన్ దండయాత్ర కొనసాగుతోంది. ఈరోజు రిలీజ్ అయిన వకీల్ సాబ్ మూవీ రికార్డు కలెక్షన్లు సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో హౌస్ ఫుల్ బోర్డులతో అత్యధిక వసూళ్లు సాధిస్తోంది. ఇక విదేశాల్లోనూ దీనికి విశేష స్పందన ఉండడం విశేషం. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” మూవీ అమెరికాలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఒకరోజు ముందు వేసిన ప్రీమియర్ షోల ద్వారా ఏకంగా ఈ మూవీ 296 డాలర్ల (దాదాపు 2.21 కోట్లు) […]

Written By: NARESH, Updated On : April 9, 2021 8:12 pm
Follow us on

థియేటర్లపై పవన్ దండయాత్ర కొనసాగుతోంది. ఈరోజు రిలీజ్ అయిన వకీల్ సాబ్ మూవీ రికార్డు కలెక్షన్లు సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో హౌస్ ఫుల్ బోర్డులతో అత్యధిక వసూళ్లు సాధిస్తోంది. ఇక విదేశాల్లోనూ దీనికి విశేష స్పందన ఉండడం విశేషం.

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” మూవీ అమెరికాలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఒకరోజు ముందు వేసిన ప్రీమియర్ షోల ద్వారా ఏకంగా ఈ మూవీ 296 డాలర్ల (దాదాపు 2.21 కోట్లు) కలెక్షన్లు సాధించడం విశేషం.

ప్రీమియర్ ద్వారా అమెరికాలో ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం మొదటిది కావడం విశేషం. ప్రీమియర్స్ లో ఇప్పటిదాకా ఈ ఏడు ఏభారతీయ సినిమా కూడా ఇంత అత్యధిక వసూళ్లు సాధించలేదని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. హిందీ సినిమాలు సైతం సాధించలేదన్నారు.

అమెరికా థియేటర్లలో 100శాతం సినిమా చూసేందుకు ఆక్యుపెన్సీపై ఆంక్షలు ఉన్నప్పటికీ ఈ చిత్రం 226 థియేటర్లలో రికార్డు వసూళ్లు సాధించింది. “వకీల్ సాబ్” సినిమాకు రివ్యూలు కూడా సానుకూలంగా ఉండడంతో ఈ వారాంతంలో మరింతగా కలెక్షన్లు పెరగవచ్చని అంటున్నారు.

ఈ చిత్రం కథ కొత్తది కాకపోయినా.. పవన్ స్టామినా.. మేనరిజం, కథాబలంతోనే సినిమాను అమెరికా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని అంటున్నారు. చాలా మంది అసలు హిందీ పింక్ సినిమాను ఇప్పటికే చూశారు. అయినా కూడా పవన్ వకీల్ సాబ్ ను చూసేందుకు ఎగబడుతుండడం విశేషం. ఈ ప్రీమియర్స్ ద్వారానే ఏకంగా 30,00,00 డాలర్లు వకీల్ సాబ్ వసూలు చేయడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

ఇటీవలి ‘జతి రత్నలు’ ప్రీమియర్ షోల ద్వారా 132000 డాలర్లు మాత్రమే వసూలు చేసింది. పవన్ సినిమా మాత్రం అంతకుమించిన వసూళ్లు సాధిస్తోంది. ఈరోజు రెగ్యులర్ షోలతో మరింతగా వసూళ్లు పెరిగే అవకాశం ఉంది.

శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన “వకీల్ సాబ్” సినిమాను దిల్ రాజు నిర్మించారు.