Tips For Wife And husband: శృంగారం విషయంలో మనకు అవగాహన తక్కువే. దీంతో దీని గురించి అపోహలతోనే కాలం గడుపుతుంటాం. శృంగారం సమయంలో మనకు ఎదురయ్యే వాటిని శాస్త్రీయంగా తెలుసుకోం. ఏదో మనకు తోచింది చెబుతాం. అది నిజమా కాదా అనే విషయం కూడా ఆలోచించం. ఈ నేపథ్యంలో ఆడవారికి వచ్చే పీరియడ్స్ విషయంలో కూడా కొన్ని అపోహలు ఉన్న మాట వాస్తవమే. ఆ సమయంలో శృంగారంలో పాల్గొనవద్దని చెబుతుంటారు. కానీ ఇందులో వాస్తవం లేదు. పీరియడ్ సమయంలో కూడా సంభోగంలో పాల్గొనవచ్చు. ఇందులో ఇలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఎక్కువమంది దానికి అంగీకరించరు. పీరియడ్ సమయంలో శృంగారం సురక్షితం కాదని నమ్ముతుంటారు.

నెలసరి సమయంలో శృంగారం చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే జీవిత భాగస్వామి కోరిక మేరకే ప్రవర్తించాలి. భార్యకు ఇష్టం లేకపోతే మానుకోవడమే మంచిది. వారికి ఇష్టమైతే ఏం ఫర్వాలేదు. పీరియడ్ సమయంలో శృంగారం చేసుకోవచ్చా? లేదా అనేది భార్యాభర్తలపై ఆధారపడి ఉంటుంది. ఇద్దరికి ఓకే అయితే అందులో ఎలాంటి నష్టం ఉండదు. ఆ సమయంలో చేసుకునే శృంగారంపై కొన్ని నిబంధనలు పాటించకపోతే ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు.

పీరియడ్ సమయంలో వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. పీరియడ్ సమయంలో జననాంగాల్లో కాస్త ఇబ్బందులు ఏర్పడతాయి. అందుకే ఆ టైంలో సంభోగం చేస్తే పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మంచిది. దీంతో ఎంజాయ్ కు ఎలాంటి అవరోధం లేకుండా ఉంటుంది. ఆమె మనోభావాలను అర్థం చేసుకుని వద్దంటే మానుకోవాలి. కావాలంటేనే ముందుకు రావాలి. అంతేకాని ఆమెను ఇబ్బంది పెట్టొద్దు. వారి మూడ్ ను బట్టి ఉదయం, సాయంత్రం సమయాల్లో ఏది ఆమెకు ఇష్టమైతే అదే టైంలో పాల్గొనడం ఉత్తమం.
Also Read: Winter Health Tips: చలికాలంలో ఈ చిట్కాలు పాటిస్తే జలుబు, జ్వరాలు దూరం..
నెలసరి సమయంలో శృంగారం చేసేటప్పుడు ప్రయోగాలు చేయకూడదు. మామూలుగానే చేయడానికి ఉత్సాహం చూపించాలి. అంతేకాని రకరకాల భంగిమలు ఉపయోగిస్తే బ్లీడింగ్ సమస్య ఏర్పడవచ్చు. దీంతో ఆమెకు సమస్యలు వస్తాయి. ఇలా మనం ప్రయోగాలకు దూరంగా ఉండి మామూలుగానే సంభోగంలో పాల్గొనడం వల్ల ఆమెకు కూడా సమస్యలు లేకుండా చేయడంలో మనవంతు పాత్ర పోషించాలి. కానీ దొరికింది కదా అని ఎలా పడితే అలా చేస్తే మనకు అంత మంచిది కాదని తెలుసుకుని ప్రవర్తిస్తే మంచిది.
Also Read: Dates For Healthy: ఖర్జూరాలు, పాలతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?