Tamanna – Vijay Varma: తమన్నా స్టార్ హీరోయిన్ గా హైట్స్ చూశారు. సీనియర్స్, జూనియర్స్, టైర్ టూ హీరోలు అనే తేడా లేకుండా అందరితో ఆడిపాడారు. ఎంతో మంది హ్యాండ్ సమ్ హీరోలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన తమన్నా… ఒక విలన్ కి పడిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇన్నేళ్ల కెరీర్లో తమన్నా ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొన్నది లేదు. ప్రొఫెషన్ పట్ల చాలా కమిటెడ్ గా ఉండే తమన్నా సక్సెస్ సీక్రెట్ కూడా అదే. ప్రేమా దోమా అంటూ మనసు గతి తప్పితే కెరీర్ క్లోజ్ అవుతుందని ఆమెకు తెలుసు. మరి ఎంతటి నిగ్రహం ఉన్నవారైనా ఏదో ఒక దశలో, ఎవరికో ఒకరికి మనసు ఇవ్వాల్సిందే. తమన్నా మనసిచ్చిన ఆ వ్యక్తి విజయ్ వర్మ అంటున్నారు.

ముంబైలో తమన్నా-విజయ్ వర్మ చట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారు. కలిసి పార్టీల్లో పాల్గొంటున్నారు. డిన్నర్ డేట్స్ కి వెళుతున్నారు. విజయ్ వర్మతో తమన్నా సన్నిహితంగా ఉంటున్న ఫోటోలు, వీడియోలు బయటకు వస్తుండగా… తమన్నాను విజయ్ వర్మను ప్రేమిస్తున్న పుకారు నిజమే అంటున్నారు. అందులోనూ రెండు రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా తమన్నా నోరు మెదపలేదు. ఎఫైర్ వార్తలను ఖండించలేదు.
విషయం ఏదైనా వెంటనే స్పష్టత ఇచ్చే తమన్నా మౌనం, అర్థాంగీకారమా? అంటున్నారు. అదే సమయంలో విజయ్ వర్మ, తమన్నా రిలేషన్ గురించి ఒక్కో విషయం బయటకు వస్తున్నారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఓ ప్రాజెక్ట్ లో తమన్నా-విజయ్ వర్మ నటిస్తున్నారట. ఆ మూవీ సెట్స్ లోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. మనసులు కలవడంతో ఒకరికొకరు దగ్గరయ్యారట. విందులు, విహారాలు చేస్తూ రిలేషన్ ఎంజాయ్ చేస్తున్నారట. విజయ్ వర్మతో తమన్నా పెళ్లి ప్రకటన చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు.

తమన్నా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. విజయ్ వర్మ మాత్రం అంతగా పరిచయం లేదు. అతడు తెలుగులో చేసింది కేవలం ఒకే ఒక చిత్రం. నాని హీరోగా విడుదలైన ఎం సి ఏ చిత్రంలో విలన్ రోల్ చేశాడు. విజయ్ వర్మ పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే కావడం విశేషం. అతడు మార్వాడి ఫ్యామిలీకి చెందివాడు. నటనపై మక్కువతో థియేటర్ ఆర్టిస్ట్ గా మారాడు. నటనలో శిక్షణ తీసుకున్నాడు. విజయ్ వర్మ ఎక్కువగా బాలీవుడ్ లో చిత్రాలు చేశాడు. కాగా తమన్నా తెలుగులో భోళా శంకర్ మూవీ చేస్తున్నారు.
[…] […]