Baby Care: పిల్లల గురించి చాలా జాగ్రత్తలు పాటించాలి.లేదంటే వారు అనారోగ్య పాలు అవుతుంటారు. వారి స్కిన్, శరీరం అన్నీ కూడా సున్నితంగా ఉంటాయి. జబ్బులు కూడా త్వరగా వ్యాపిస్తాయి. అందుకే వారి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వారిని శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. ఎలాంటి దుమ్ము ధూళి వారి దరి చేరకుండా చూసుకోవాలి. ఇక జలుబు, జ్వరం కూడా ఎక్కువగా వస్తాయి పిల్లలకు. అయితే కొందరు జలుబు చేస్తే స్నానం చేయించకూడదు అంటారు. అందులో నిజం ఎంత అంటే..
ప్రస్తుతం పిల్లలకు జలుబు, మోషన్స్, వామ్ టింగ్స్ వంటివి ఎక్కువగా అవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, పరిశుభ్రత లేని పరిసరాలు పిల్లలకు మరింత వ్యాధులను తెచ్చిపెడుతాయి. ఇక జలుబు ఉన్నప్పుడు స్నానం చేయించరు చాలా మంది. కానీ కచ్చితంగా పిల్లలకు స్నానం చేయించాలి అంటున్నారు వైద్యులు. కానీ మీరు స్నానం చేయించరు కదా.. అవును చాలా మంది పిల్లలకు జలుబు చేస్తే వారం అయినా సరే స్నానం చేయించకుండా ఉంటారు. ఇలాంటి వారు కూడా చాలా మందే ఉన్నారు.
ఇక పిల్లలకు చన్నీరు తగలకుండా వేడి నీటితో స్నానం చేయడం, కఫం క్లీన్ చేయడం మర్చిపోకండి. వీలైనంత ఆవిరిని పట్టే ప్రయత్నం చేస్తూ ఉండండి. కానీ ఎక్కువగా వేడి ఉండకుండా చూసుకోండి. ఆవిరి వల్ల శ్లేషాన్ని కరిగించి గొంతును రిలాక్స్ చేస్తుంది. పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంచడం చాలా ముఖ్యం. అందుకోసం హ్యాపీగా నిద్రపోయేలా చూడండి. దీని వల్ల వైరస్ లు సోకవు. ముఖ్యంగా పిల్లలను హత్తుకొని పడుకోండి. దీని వల్ల వారికి ఉపశమనం ఉంటుంది.
ఇక పిల్లలకు జలుబు, జ్వరం వచ్చినప్పుడు వేడి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీకు స్నానం చేయించడం ఇష్టం లేకపోతే కనీసం వేడి నీటిని తీసుకొని అందులో గుడ్డను ముంచి బాడీని క్లీన్ చేస్తూ ఉండండి. దీని వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ కచ్చితంగా పిల్లలను శుభ్రంగా ఉంచడం మర్చిపోకండి.