https://oktelugu.com/

మందులతో మగపిల్లలు పుడుతారా..?

భారతదేశంలో ఆడపిల్లల సంఖ్య తగ్గుతూ.. మగపిల్లల సంఖ్య పెరిగిపోతోందని తాజాగా కేంద్రం చేసిన సర్వేలో తేలింది. 2030 వరకు దేశంలో ఆడపిల్లల జనాభా భారీగా పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఖచ్చితంగా ఆడపిల్లలకు డిమాండ్ పెరిగి కన్యాశుల్యం వస్తుందని.. మగవారికి పెళ్లికాని ఉపద్రవం ముంచుకొస్తుందని తాజాగా చేసిన సర్వేలో తేలింది. సైన్స్ ఆవిష్కరణలు పెరిగే  కడుపులో ఉన్నది ఏ బిడ్డ ఇట్టే తెలిసిపోతోంది.  కానీ  ఇప్పుడున్న శాస్త్ర సాంకేతిక ఎంత పెరిగినా కేవలం గర్భంలో మగబిడ్డనే […]

Written By:
  • NARESH
  • , Updated On : September 7, 2020 / 04:16 PM IST

    Baby born boys

    Follow us on

    భారతదేశంలో ఆడపిల్లల సంఖ్య తగ్గుతూ.. మగపిల్లల సంఖ్య పెరిగిపోతోందని తాజాగా కేంద్రం చేసిన సర్వేలో తేలింది. 2030 వరకు దేశంలో ఆడపిల్లల జనాభా భారీగా పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఖచ్చితంగా ఆడపిల్లలకు డిమాండ్ పెరిగి కన్యాశుల్యం వస్తుందని.. మగవారికి పెళ్లికాని ఉపద్రవం ముంచుకొస్తుందని తాజాగా చేసిన సర్వేలో తేలింది.

    సైన్స్ ఆవిష్కరణలు పెరిగే  కడుపులో ఉన్నది ఏ బిడ్డ ఇట్టే తెలిసిపోతోంది.  కానీ  ఇప్పుడున్న శాస్త్ర సాంకేతిక ఎంత పెరిగినా కేవలం గర్భంలో మగబిడ్డనే పుట్టించాలనే పరిశోధన మాత్రం ముందుకు సాగడం లేదు..

    అయితే తాజాగా మగబిడ్డ పుట్టాలంటే కొన్ని మందులు వాడాలంటూ కొందరు ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఈ మందులు వాడితే మగపిల్లలు పుడుతారని నమ్మిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆ మందుల కోసం ఇప్పుడు మగ సంతానం లేని వారు లక్షలు ఖర్చు చేస్తున్నారట..

    తాజాగా ఈ విషయంపై వైద్యులు, నిపుణులు స్పందించారు. మందులతో ఆడ, మగ బిడ్డను డిసైడ్ చేయలేమని స్పష్టం చేస్తున్నారు. గర్భం దాల్చడం వరకే మన చేతుల్లో ఉంటుందని.. ఆడబిడ్డ, మగబిడ్డ అనేది తేల్చడం ఎవరి చేతుల్లో ఉండదని స్పష్టం చేస్తున్నారు..

    సైన్స్ ప్రకారం.. గర్భం దాల్చగానే మహిళల అండంలో ఉండే ‘ఎక్స్’, ‘ఎక్స్’ క్రోమోజోములు, పురుషుల వీర్యంలో ఉండే ‘ఎక్స్’, ‘వై’ క్రోమోజోముల కలయిక జరుగుతుంది. మహిళ ఎక్స్, పురుషుడి వై కలిస్తే మగ బిడ్డ, మహిళ ఎక్స్, పురుషుడి ఎక్స్ కలిస్తే ఆడబిడ్డ పుడుతుంది. దీన్ని ప్రభావితం చేయడం మన వైద్యశాస్త్రం చేతుల్లో కూడా లేదు. అదృష్టంపైనే ఆధారపడుతుంది.

    అయితే పురుషులకు వై క్రోమోజోములు పెంచే మందులు ఉన్నాయని కొంత మంది ప్రచారం మొదలు పెట్టారు. దీనికోసం ఇప్పుడు భారీగా ఖర్చు చేస్తున్నారు. మనిషిలోని క్రోమోజోములను పెంచే మందులు ఏవీ లేవని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతీ మనిషి కణంలోనూ ఎక్స్, వై క్రోమో జోములు ఉంటాయని చెబుతున్నారు.వాటిని పెంచడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు.