https://oktelugu.com/

ప్రజలకు హెచ్చరిక: తెలంగాణను కమ్మేసిన చలి.. కారణం అదే

చలి చంపేస్తోంది. క్రిస్మస్ , నూతన సంవత్సర వేడుకలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ రాష్ట్రాన్ని చలి కమ్మేసింది. ఎన్నడూ లేనంతగా సోమవారం ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. చలి గుప్పిట చిక్కి తెలంగాణ రాష్ట్రం విలవిలలాడింది. Also Read: కేసీఆర్ కు డబ్బులు ఇచ్చాను.. బాంబు పేల్చిన విజయశాంతి తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇంత భారీగా పడిపోవడంతో వృద్ధులు, చిన్న పిల్లలు వణికిపోతున్నారు. అత్యల్పంగా కొమురం భీం జిల్లాలో ఏకంగా 4.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు […]

Written By:
  • NARESH
  • , Updated On : December 22, 2020 7:49 pm
    Follow us on

    చలి చంపేస్తోంది. క్రిస్మస్ , నూతన సంవత్సర వేడుకలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ రాష్ట్రాన్ని చలి కమ్మేసింది. ఎన్నడూ లేనంతగా సోమవారం ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. చలి గుప్పిట చిక్కి తెలంగాణ రాష్ట్రం విలవిలలాడింది.

    Also Read: కేసీఆర్ కు డబ్బులు ఇచ్చాను.. బాంబు పేల్చిన విజయశాంతి

    తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇంత భారీగా పడిపోవడంతో వృద్ధులు, చిన్న పిల్లలు వణికిపోతున్నారు. అత్యల్పంగా కొమురం భీం జిల్లాలో ఏకంగా 4.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం అందరినీ నిద్రలేకుండా చేస్తోంది.

    తెలంగాణలో చలిపంజాకు ఉత్తరం నుంచి వీచే గాలులే కారణమని తెలిసింది. రాష్ట్రంలోకి ఈశాన్య, ఉత్తర దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం తెలిపారు.

    యాంటీ సైక్లోనిక్ ఒకటి సెంట్రల్ ఇండియా పరిసర ప్రాంతాల్లో ఉండటం వల్ల తెలంగాణ మీదుగా చలిగాలులు వీస్తున్నాయని ఆమె వెల్లడించారు. అందుకోసమే ఉత్తర, పశ్చిమ తెలంగాణ ప్రాంతాల్లో అతి తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం తెలిపారు.

    Also Read: బీజేపీ వ్యతిరేక సమావేశాన్ని కేసీఆర్ ఎందుకు విరమించుకున్నారు?

    రానున్న రెండు మూడు రోజుల్లో తెలంగాణలో కోల్డ్ వేవ్ కండీషన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉందని ఆమె తెలిపారు.

    తెలంగాణలో కొమురం భీం తరువాత ఆదిలాబాద్ లో 4.6 డిగ్రీలు, వికారాబాద్ లో 5, సంగారెడ్డిలో 5.1, హైదరాబాద్ లో 10.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్