Brain Function : మానవ శరీరంలో ప్రతి అవయం చాలా ప్రధానమైనదే. కానీ అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే మెదడు పనితీరు బాగుండాలి. మెదడు పనితీరు బాగా లేకపోతే ఏ పని చేయడానికి సాధ్యపడదు. అయితే మెదడును ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. మెదడు ఆరోగ్యంగా ఉంటేనే అన్ని రకాల ఆలోచనలు వచ్చి పనులు చక్కబెట్టుకునే అవకాశం ఉంటుంది. నేటి కాలంలో ఒత్తిడి తో పాటు అనేక రకాల సమస్యల వల్ల ఆలోచన శక్తిని కోల్పోతున్నారు. దీంతో చాలామందికి అల్జీమర్స్ తో పాటు ఇతర సమస్యలు వస్తున్నాయి. అయితే శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం ఎంత ముఖ్యమో మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే బ్రెయిన్ ఎక్సర్సైజ్ కూడా అంతే అవసరం. మరి బ్రెయిన్ ఎక్సర్సైజ్ ఎలా చేస్తారు? మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఏ పనులు చేయాలి?
Also Read : దారుణమైన సమస్యగా మారుతున్న బ్రెయిన్ ఫాగ్.. లక్షణాలు ఇవే..
ఎంతో విలువైన సమాచారం మెదడులో దాగి ఉంటుంది. అయితే ఉన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు గుర్తుచేసుకోకుండా కొత్త సమాచారం గురించి తెలుసుకుంటూ ఉండాలి. కొత్త విషయాలు తెలుసుకునే ఆసక్తిని కనబరుచుకోవాలి. అంటే ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటే మెదడు ఉత్సాహంగా పనిచేస్తుంది. అలా కాకుండా ఏ విషయం గురించి ఆలోచించకపోతే మెదడు మొద్దుబారిపోతుంది. సాధ్యమైనంతవరకు కొత్త విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
మాట్లాడడానికి భాష ప్రధానంగా ఉంటుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాషతో మాట్లాడుతూ ఉంటారు. అయితే ఎప్పటికీ మాట్లాడే భాష కాకుండా కొత్త భాషలను నేర్చుకునే ప్రయత్నం చేయాలి. పబ్ మేడ్ సెంట్రల్ ‘ది కాగ్నిటివ్ బెనిఫిట్స్ అఫ్ బీయింగ్ బై లింగ్వల్ ‘ రచించిన నివేదిక ప్రకారం.. ఒక వ్యక్తి రెండు భాషల్లో ప్రావీణ్యం ఉంటే అతని మెదడు చురుగ్గా ఉంటుందట. అంతేకాకుండా ఆ వ్యక్తికి జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుందని ఈ నివేదిక తెలుపుతుంది. అందువల్ల మాట్లాడే భాష కాకుండా కొత్త భాషను నేర్చుకునే ప్రయత్నం చేయాలి.
కొత్త కొత్త ఆలోచనలు రావాలంటే నిత్యం గేమ్స్ ఆడుతూ ఉండాలి. అయితే సాధారణ గేమ్స్ కంటే బ్రెయిన్ గేమ్స్ ఎక్కువగా ఆడుతుండడం వల్ల మెదడు షార్ప్ గా తయారవుతుంది. మెదడుకు ఆలోచన శక్తి పెరిగి కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు. ఈ క్రమంలో అలసట కూడా ఉండకుండా నిత్యం ఉత్సాహంగా ఉంటారు. అందువల్ల మెదడు చురుగ్గా ఉండాలంటే బ్రెయిన్ గేమ్స్ ఆడుతూ ఉండాలి.
సంగీతంతో ప్రాణాలను కూడా బ్రతికించవచ్చు అంటారు. అలాంటప్పుడు సంగీతంతో మెదడును కూడా చురుగ్గా ఉంచుకునే అవకాశం ఉంటుంది. ఇష్టమైన సంగీతం వినడం వల్ల మెదడు ఉత్సాహంగా ఉంటుంది. అంతేకాకుండా కొత్త కొత్త మ్యూజిక్ వినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. బ్రెయిన్ షాపు కావాలని కోరుకునేవారు తమకు ఇష్టమైన సంగీతంతో పాటు.. కొత్త మ్యూజిక్ ను ఆస్వాదించాలి.
నిత్యం ఒత్తిడితో ఉండడం వల్ల మెదడు అలసిపోతుంది. దీంతో ధ్యానం చేయడం వల్ల ప్రశాంతతను పొందుతారు. నిత్యం ధ్యానం చేయడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉండి ఎలాంటి చెడు ఆలోచనలు రానీయకుండా కాపాడుతాయి.
Also Read : డైలీ ఇలా చేస్తే.. మెదడు పనితీరు మెరుగుపడటం గ్యారెంటీ?