https://oktelugu.com/

18 నెలలుగా టాయిలెట్‌కు వెళ్లని యువకుడు.. షాకైన శాస్త్రవేత్తలు, వైద్యులు..?

కాలం మారే కొద్దీ మనుషులు కొత్తకొత్త ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కొన్ని వ్యాధుల గురించి తెలిస్తే ఇలాంటి ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయా..? అని ఆశ్చర్యపోవడం మన వంతవుతోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మురౌనా ప్రాంతానికి చెందిన అశీష్ అనే యువకుని వయస్సు 16 సంవత్సరాలు. ఈ యువకుడు సంవత్సరంన్నర నుంచి టాయిలెట్ కు వెళ్లలేదు. అయితే సాధారణంగా ఇలాంటి విచిత్రమైన సమస్య ఉంటే ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ విచిత్రం ఏమిటంటే ఈ యువకుడిని […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 22, 2020 / 06:48 PM IST
    Follow us on


    కాలం మారే కొద్దీ మనుషులు కొత్తకొత్త ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కొన్ని వ్యాధుల గురించి తెలిస్తే ఇలాంటి ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయా..? అని ఆశ్చర్యపోవడం మన వంతవుతోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మురౌనా ప్రాంతానికి చెందిన అశీష్ అనే యువకుని వయస్సు 16 సంవత్సరాలు. ఈ యువకుడు సంవత్సరంన్నర నుంచి టాయిలెట్ కు వెళ్లలేదు. అయితే సాధారణంగా ఇలాంటి విచిత్రమైన సమస్య ఉంటే ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.

    కానీ విచిత్రం ఏమిటంటే ఈ యువకుడిని ఇతర ఆరోగ్య సమస్యలు సైతం వేధించలేదు. అయితే ప్రస్తుతం ఎటువంటి సమస్య లేకపోయినా భవిష్యత్తులో ఏదైనా సమస్య తలెత్తవచ్చని బాలుడి తల్లిదండ్రులు, బాలుడు కంగారు పడుతున్నారు. బాలుడు ప్రతిరోజూ ఆహారంగా 18 నుంచి 20 రొట్టెలు తీసుకుంటున్నాడు. ఆహారం తీసుంటున్నా అతను టాయిలెట్ కు వెళ్లపోవడంతో బాలుడికి ఏదో వింత వ్యాధి సోకి ఉండవచ్చని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

    శాస్త్రవేత్తలు , వైద్యులు సైతం గతంలో తాము ఇలాంటి విచిత్రమైన కేసును ఎప్పుడూ చూడలేదని.. పరీక్షలు చేసినా అతనికి ఉన్న వ్యాధికి గుర్తించలేకపోయామని చెబుతున్నారు. చాలామంది వైద్యులు ఇప్పటికే బాలుడిని పరీక్షించి సమస్య ఏమిటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఎంతోమంది వైద్యుల చుట్టూ తిప్పుతున్నా వైద్యులు అతని సమస్యకు పరిష్కారం చూపించలేకపోయారు.

    అయితే ఈ వింత వ్యాధికి గల కారణాలు తెలియాల్సి ఉంది. బాలుడు అశీష్ తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ ఈ వింత వ్యాధి వల్ల తమ కొడుకు ప్రాణాలకు ప్రమాదం ఉందని భయంగా ఉందని చెబుతున్నారు. భవిష్యత్తులోనైనా బాలుడి సమస్యకు పరిష్కారం లభిస్తుందో లేదో చూడాలి.