బిగ్ బాస్ : ప్రోమోనే ఇలా ఉంటే.. ఇక ఎపిసోడ్ ఎలా ఉంటుందో !

బిగ్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4లో నిన్నంతా సరదా సరదాగా గడిచిపోవడంతో ఈ రోజు ఎపిసోడ్ పై ఆసక్తి రెట్టింపు అయింది. కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు నాగార్జున సాక్షిగా మరో అవకాశం కల్పించడం, పైగా నేడు ఎలిమినేషన్ కూడా ఉండనుండటంతో రాత్రి షో కోసం అందరూ ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు. అయితే రాత్రి ప్లే అవ్వబోయే ఎపిసోడ్ లో సేవ్ అయ్యేవాళ్లని ప్రకటించే ప్రక్రియలో నాగార్జున వారితో మంచి ఫన్నీ గేమ్స్ ఆడించినట్లు తెలుస్తోంది. […]

Written By: admin, Updated On : November 22, 2020 7:27 pm
Follow us on


బిగ్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4లో నిన్నంతా సరదా సరదాగా గడిచిపోవడంతో ఈ రోజు ఎపిసోడ్ పై ఆసక్తి రెట్టింపు అయింది. కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు నాగార్జున సాక్షిగా మరో అవకాశం కల్పించడం, పైగా నేడు ఎలిమినేషన్ కూడా ఉండనుండటంతో రాత్రి షో కోసం అందరూ ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు. అయితే రాత్రి ప్లే అవ్వబోయే ఎపిసోడ్ లో సేవ్ అయ్యేవాళ్లని ప్రకటించే ప్రక్రియలో నాగార్జున వారితో మంచి ఫన్నీ గేమ్స్ ఆడించినట్లు తెలుస్తోంది. ఇక ఆ గేమ్స్ లో భాగంగా మ్యూజిక్ ప్లే చేసి..అది ఏ పాటో చెప్పాలని నాగ్ అడగడం కూడా బాగా ఎంటర్ టైన్ గా ఉంది.

Also Read: రానాతో సామ్ ‘జామ్’ ఎలా ఉండబోతుందో ?

ముఖ్యంగా మ్యూజిక్ రాగానే కంటెస్టెంట్లకు బజర్ కొట్టే అవకాశం ఇవ్వడంతో… ముందు బజర్ కొట్టినవాళ్లు పాట పేరు చెప్పాలి అనే కండీషన్ పెట్టడంతో నైట్ షో మరీ రసవత్తరంగా మారనుంది. కాగా ఈ గేమ్ లో అవినాష్‌ను తికమకపెడుతూ నాగ్ ఫుల్ గా ఆడుకున్నాడు. మొదట అవినాష్ కరెక్ట్ ఆన్సర్ చెప్పినా, మళ్లీ తప్పు చెప్పేలా కన్ఫూజ్ చేస్తూ ఫన్ రైజ్ చేశాడు నాగ్. అలాగే ‘కలర్ ఫుల్ చిలకా’ పాటకు ఇంటి సభ్యులంతా డ్యాన్స్‌తో హెరెత్తించడం.. అనంతరం హారిక నామినేషన్ నుంచి సేఫ్ అయినప్పుడు ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో చూపించాలని నాగ్ అవినాష్‌ను కోరడంతో.. అవినాష్ హారికను ఇమిటేట్ చేసిన తీరు ఫుల్ గా నవ్వించాయి.

Also Read: మోహన్ బాబు నటప్రస్థానానికి నేటితో 45ఏళ్లు పూర్తి..!

ఇక ఆ తరువాత నాగ్ అందరి చేత క్యూబ్ ఆట ఆడించాడు. క్యూబ్ ఆటలో భాగంగా పలువురికి పలు యాక్టివిటీలు ఇవ్వడం.. అందులో భాగంగా సోహైల్ నోటితో అవినాష్‌కు గోళ్ల రంగు వేశాడు. ‘ఎంత చక్కగా వేస్తున్నావ్’ అని నాగ్ అనగా..’నైట్ 9 తర్వాత అతడు చేసే పనులు ఇవే’ అంటూ అవినాష్ పై వేసిన పంచ్ బాగానే పేలింది. అనంతరం అవినాష్ శారీ కట్టుకుని ‘నిన్ను చూడకుంటే చాలు చెపంల్లోనా పింపుల్’ పాటకు వేసిన డ్యాన్స్ కు.. మొత్తానికి నాగ్ కూడా ‘పెంటాస్టిక్’ అంటూ పలకడంతో అందరూ ఫక్కున నవ్వారు. ముఖ్యంగా అరియానా అయితే ఇంకా పగలబడి నవ్వింది. మొత్తానికి ప్రోమోనే ఇలా ఉంటే.. ఇక ఫుల్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్