Health Tips: శరీరానికి కావాల్సిన ఆరోగ్యం కోసం రోజు తినే సాధారణ ఆహారమే కాకుండా ప్రత్యేకమైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అదనపు శక్తి వస్తుంది. అంటే ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రోటీన్లు అనగానే తక్కువగా మాంసాహార కృతుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. దీంతో చికెన్, మటన్, ఫిష్ వాంటి వాటికోసం ఆరాటపడతారు. అయితే కొందరు మాంసాహారాలను ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడరు. ఇలాంటివారు మాత్రమే కాకుండా మిగతావారు కూడా శాఖాహారంలోనూ అనువైన ప్రోటీన్లు ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోవాలి. కొన్ని కూరగాయలు, పప్పులు, గింజలు వంటివి తీసుకోవడం వల్ల మాంసాహారాల కంటే ఎక్కువగా ప్రోటీన్లు అందిస్తాయి. అయితే ఏఏ పదార్థాల్లో ఎటువంటి ప్రోటీన్లు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతిరోజు కూర లేనిదే ముద్ద దిగదు కొందరికి. అయితే కొందరు మాత్రం మాంసాహారం ఉండాలని అనుకుంటారు. కానీ మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే వీటి స్థానంలో కూరగాయలు తీసుకోవడం ఎంతో ఉత్తమని తెలుస్తోంది. ఎందుకంటే కూరగాయల్లోని ప్రతి వంద గ్రామంలో మూడు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ముఖ్యంగా బ్రోకలీ లో మాంసాహారం వలె ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. దీనిని ఉడికించడం వల్ల మరింతగా పెరిగే అవకాశం ఉంది. అలాగే పుట్టగొడుగుల్లో కూడా నాలుగు గ్రాములు, పచ్చి బఠానీలలో ఐదు గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి.
కూరగాయలు మాత్రమే కాకుండా కొన్ని గింజల్లో ప్రత్యేకమైన శక్తిని ఇచ్చే ప్రోటీన్లు ఉంటాయి. వీటిలో బాదం పప్పులు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. 100 గ్రాముల బాదంపప్పులో 21 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాగే పిస్తాలో 20 గ్రాములు, జీడిపప్పులో 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వేరుశనగలు 25 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అందువల్ల డైలీ స్నాక్స్ కు లేదా సరదా కోసం వీటిని తీసుకున్న అత్యధిక ఎనర్జీ వస్తుంది. వీటితోపాటు పప్పుల్లో కూడా అధికంగా ప్రోటీన్లు లభిస్తాయి. అత్యధికంగా 100 గ్రాముల శనగల్లో 20 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అలాగే గోధుమల్లో 13 గ్రాములు, బియ్యంలో మూడు గ్రాములు, క్వినోవాలో 4 గ్రాముల రొటీన్ లభిస్తుంది. ఇక సోయా చిక్కుడు లో 40 శాతం వరకు ప్రోటీన్ ఉంటుంది. సోయా కు సంబంధించిన పదార్థాలను తీసుకోవడం వల్ల మాంసాహారం కంటే ఎక్కువగా ఎనర్జీ ని తీసుకున్న వారవుతారు.
పై కూరగాయలు, గింజలు తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫలితంగా మాంసాహారాలకి సమానంగా ప్రోటీన్లు అందిస్తాయి. అయితే మాంసాహారాలు తీసుకుంటే అదనంగా బరువు పెరగడం లేదా ఇతర కొవ్వు పదార్థాలు ఎక్కువగా రావడం వంటివి ఉంటాయి. అందువల్ల సాధ్యమైనంతవరకు శాఖాహార పదార్థాలు తీసుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే వారంలో ఒకసారి లేదా ఎప్పుడైనా రుచికోసం మాంసాహారాలను తీసుకుంటూ ఉండాలి. పదేపదే తీసుకోవడం వల్ల నష్టమే జరుగుతుంది అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శాఖాహారాలను తక్కువ ధరకు లభించడంతో వీటిపైనే ఎక్కువగా దృష్టి పెట్టాలని అంటున్నారు.