Homeహెల్త్‌Tips for peaceful sleep: రాత్రి సమయంలో ప్రశాంతమైన నిద్ర పట్టేందుకు సూపర్ చిట్కాలు ఇవే..

Tips for peaceful sleep: రాత్రి సమయంలో ప్రశాంతమైన నిద్ర పట్టేందుకు సూపర్ చిట్కాలు ఇవే..

Tips for peaceful sleep: మనిషికి ఆహారంతో పాటు సరైన నిద్ర ఉండడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అయితే ప్రస్తుత కాలంలో రకరకాల కారణాలవల్ల చాలామంది కలత నిద్ర పోతున్నారు. దీంతో ఆ మరుసటి రోజు మనశాంతి లోపించి తీవ్ర ఆందోళనతో కనిపిస్తున్నారు. అంతేకాకుండా నాణ్యమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా సరైన నిద్ర పట్టి అవకాశాలు ఉన్నాయని కొందరు వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి సమయంలో నాణ్యమైన నిద్ర పోవాల్సిన అవసరం చాలా ఉంది. అయితే నిద్ర నాణ్యంగా రావాలంటే కొన్ని ప్రత్యేకంగా చిట్కాలు పాటించాల్సి ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు. ఆ చిట్కాలు ఏవో ఇప్పుడు చూద్దాం..

ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పనిలో బిజీగా ఉన్నవారు రాత్రి రిలాక్స్ కోసం ఒకప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఇంటికి రాగానే మొబైల్ తో కాలక్షేపం చేస్తున్నారు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మొబైల్ స్క్రీన్ ను చూస్తూ గడిపేస్తున్నారు. ఇలా రాత్రి సమయంలో మొబైల్ స్క్రీన్ చూడడం వల్ల మానసికంగా ఘర్షణలు ఏర్పడి రాత్రి సమయంలో నాణ్యమైన నిద్రపట్టే అవకాశం ఉండదు. అందువల్ల నిద్రపోయే కనీసం రెండు గంటల ముందు మొబైల్ స్క్రీన్ కు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా టీవీ, లాప్టాప్స్ వంటివి కూడా ఉపయోగించకుండా ఉండాలి.

కొందరికి పుస్తకాలు చదివే అలవాటు చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇందులో ఎంతో జ్ఞానం ఉండడంతో పాటు మానసికంగా ప్రశాంతతను కలిగి ఉంటారు. ఏదైనా కథలో లేదా నచ్చిన పుస్తకాన్ని నిద్రపోయే ముందు చదవడం వల్ల ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. దీంతో నాణ్యమైన నిద్ర కూడా పట్టే అవకాశం ఉంటుంది. పెద్దలు మాత్రమే కాకుండా పిల్లలకు కూడా కథలు వంటివి పుస్తకాలు చదివించాలి. వీరు కూడా ఎలాంటి ఘర్షణ లేకుండా హాయిగా నిద్రపోతారు.

చాలామంది రోజుకు ఒకే సమయానికి నిద్రపోరు. కానీ ఒక నెల రోజులపాటు ఒకే సమయంలో నిద్రించి.. ఒకే సమయంలో నిద్ర లేచే ప్రయత్నం చేయాలి. ఇలా ఒక నెలపాటు కచ్చితంగా చేయడం వల్ల ఆ తర్వాత ఇది అలవాటుగా మారిపోతుంది. ఫలితంగా ఆ సమయం రాగానే హాయిగా నిద్ర పట్టే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఒకే సమయంలో నిద్ర లేవడం వల్ల ఉదయం ఎలాంటి మనశ్శాంతి లోపించకుండా ఉంటుంది.

చాలామంది నైట్ డిన్నర్ చేసిన తర్వాత వెంటనే పడుకుంటూ ఉంటారు. అలాకాకుండా నిద్రపోవాలని అనుకునే 2 గంటల ముందు డిన్నర్ చేసి ఆ తర్వాత ప్రశాంతమైన వాతావరణంలో గడపాలి. దీంతో అప్పటివరకు జీర్ణక్రియ ప్రక్రియ మొదలై పడుకున్న తర్వాత ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటుంది. లేకుంటే ఇది ఇబ్బందిగా మారుతుంది. అంతేకాకుండా రాత్రి సమయంలో సాత్విక లేదా లైట్ ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది.

ప్రశాంతమైన నిద్ర కోసం నాణ్యమైన ఆహారం మాత్రమే కాకుండా బెడ్ రూమ్ ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఈ రూమ్ ఎంత శుభ్రంగా ఉంటే అంతా ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఈ గదిలో ఎలాంటి డస్టు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు ప్రశాంతమైన నిద్రపట్టే అవకాశం ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular