
భారత్ లో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే వైరస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఉంది. కరోనా బారిన పడితే 14 రోజుల్లో కోలుకున్నా వైరస్ వల్ల భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
వైద్యులు, శాస్త్రవేత్తలు ప్రతిరోజూ గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల అనేక లాభాలు ఉంటాయని వెల్లడిస్తున్నారు. సాధారణంగా మనమంతా చల్ల నీరు తాగడానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. కరోనా ఉధృతి తగ్గే వరకు చల్ల నీళ్ల కంటే కాచి చల్లార్చిన నీటిని తీసుకుంటే మంచిది. ప్రతిరోజూ గోరు వెచ్చని నీళ్లు తాగే వారిలో జీర్ణశక్తి మెరుగుపడుతుంది. గోరువెచ్చని నీళ్లు తాగటం మొదట్లో కష్టంగా అనిపించినా క్రమంగా అదే అలవాటుగా మారుతుంది.
గోరువెచ్చని నీళ్లు అనేక రోగాల బారిన పడకుండా మనల్ని రక్షిస్తాయి. గోరువెచ్చని నీళ్లు తీసుకునే వారికి ఆకలి బాగా వేయడంతో పాటు మలవిసర్జనసాఫీగా సాగుతుంది. ఆయాసం, దగ్గు, జలుబు లాంటి సమస్యలు దూరమవుతాయి. రోజూ గోరువెచ్చని నీళ్లను తీసుకుంటే ఆర్థరైటిస్ నుంచి బయటపడవచ్చు. డీ హైడ్రేషన్ సమస్యతో బాధ పడే వాళ్లకు గోరువెచ్చని నీళ్లు ఆ సమస్యను దూరం చేస్తాయి.
గోరువెచ్చని నీళ్లు శరీరంలో రక్తప్రసరణను పెంచడంలో సహాయపడతాయి. గోరువెచ్చని నీళ్లు షుగర్ లెవెల్స్ ను సైతం అదుపులో ఉంచుతాయని సమాచారం. గొంతు సమస్యలను దూరం చేయడంలో గోరువెచ్చని నీళ్లు సహాయపడతాయి. ఉదయం నిద్ర లేచిన వెంటనే నెమ్మదిగా గుటకలు వేస్తూ గోరువెచ్చని నీళ్లను తీసుకుంటే మంచిది.