Walking Benefits: ప్రస్తుత రోజుల్లో అందరికి బద్ధకం పెరుగుతోంది. ఆహారం తిన్న తరువాత వెంటనే నిద్రపోయేందుకు రెడీ అవుతున్నారు. దీంతో చాలా రకాల సమస్యలు వస్తాయి. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. రాత్రి భోజనం చేసిన తరువాత ఓ పది నిమిషాలు నడిస్తే ఎంతో మంచిది. ఏవో పనులు ఉన్నాయని వాయిదా వేస్తుంటారు. ఇది సరైంది కాదు. క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం మంచి అలవాటు. తిన్న తరువాత వాకింగ్ చేయడం వల్ల ఎన్నో లాభాలున్నాయి.
కంట్రోల్ లో షుగర్
ప్రతి రోజు భోజనం చేశాక పది నిమిషాలు నడిస్తే మధుమేహం నియంత్రణలోకి వస్తుంది. మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేందుకు ఈ నడక ఉపయోగపడుతుంది. రక్తంలో గ్లూకోజ్ ను అదుపులో ఉంచుతుంది. దీంతో రోజు పది నిమిషాలు కేటాయించి నడిచేందుకు సిద్ధంగా ఉండాలి. రోజుకో కొంత సమయం పెంచుకుంటూ అరగంటపాటు నడిస్తే ఇంకా మేలు.
నిద్రలేమికి చెక్
రాత్రి తిన్న వెంటనే పడుకోకుండా ఇలా నడిస్తే హాయిగా నిద్ర పడుతుంది. నిద్ర రాక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దీనికి నడక చెక్ పెడుతుంది. ప్రతిరోజు రాత్రి భోజనం చేశాక ఓ పది నిమిషాల నుంచి అరగంట పాటు నడవడం వల్ల మన ఒంట్లో తిన్న ఆహారం జీర్ణం అయి సుఖమైన నిద్ర పట్టేలా దోహదపడుతుంది. అందుకే అందరు నడవడానికి ఇష్టపడితే ఇంకా మంచిది.
మెరుగైన జీర్ణ క్రియ
రోజు మనం నడవడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. మనం తిన్న ఆహారం నడక వల్ల జీర్ణం అవుతుంది. దీంతో కడుపు ఖాళీ అవుతుంది. మంచి నిద్ర పట్టేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. అందుకే రాత్రి భోజనం చేశాక నడవడం అలవాటు చేసుకుంటే సరి. లేదంటే అనారోగ్యాలు రావడం ఖాయం. దీన్ని అందరు గుర్తుంచుకుంటే ప్రయోజనాలు మెండు.
గుండె ఆరోగ్యానికి మేలు
ప్రస్తుత రోజుల్లో గుండె జబ్బులు బాధిస్తున్నాయి. రాత్రి భోజనం చేసిన పది నిమిషాలు నడవడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. బీపీ కంట్రోల్ లో ఉంటుంది. గుండెకు రక్తనాళాల నుంచి సరఫరా అయ్యే రక్తం సాఫీగా సాగడానికి ఆస్కారం ఉంటుంది. దీని వల్ల గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది. అందుకే నడక వల్ల ఆరోగ్యం బాగుంటుందని సర్వేలు చెబుతున్నాయి.