Homeక్రీడలుRohit Sharma: ఫాపం.. రోహిత్ శర్మను మళ్లీ చీట్ చేశారు..!

Rohit Sharma: ఫాపం.. రోహిత్ శర్మను మళ్లీ చీట్ చేశారు..!

Rohit Sharma: ఈ ఏడాది ఐపీఎల్ లో ఎంపైర్ల తప్పిద నిర్ణయాలు కొనసాగుతున్నాయి. రోహిత్ శర్మ పుట్టినరోజు నాడు ఎంపైర్ తీసుకున్న తప్పు నిర్ణయం వల్ల ఔట్ కాకపోయినప్పటికీ పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది రోహిత్ శర్మ. తాజాగా మంగళవారం బెంగుళూరు జట్టుతో జరిగిన మ్యాచ్ లోను అదే జరిగింది. రోహిత్ శర్మ అవుట్ కాకపోయినప్పటికీ.. అవుట్ గా ప్రకటించడంతో మరోసారి ఎంపైర్ల నిర్ణయాలపై జోరుగా చర్చ జరుగుతోంది.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఐపీఎల్ లో ఎంపైర్లు నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. గ్రౌండ్ ఎంపైర్లతో పాటు థర్డ్ ఎంపైర్లు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుండడంతో అనేక విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాది ఒక్క రోహిత్ శర్మ విషయంలోనే రెండుసార్లు ఇటువంటి నిర్ణయాలు జరగడం గమనార్హం.

భారీ పరుగుల లక్ష్యంతో దూకుడుగా ఆడిన ముంబై..

బెంగళూరు జట్టుపై సూపర్ విక్టరీ సాధించిన ముంబై ఇండియన్స్ మూడో స్థానానికి దూసుకెళ్లింది. 200 పరుగుల టార్గెట్ తో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. చేజింగ్ లో ఇషాన్ కిషన్ ఫస్ట్ బాల్ నుంచి హిట్టింగ్ చేశాడు. సెకండ్ ఓవర్ లో మూడు ఫ్లోర్లు, తరువాతి ఓవర్లో నాలుగు సిక్సులు, ఓ ఫోర్ కొట్టడంతో ముంబై స్కోరు 51 కి చేరింది. కానీ, ఐదో ఓవర్లో హసరంగా ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీసి ముంబై జట్టుకు షాక్ ఇచ్చాడు. మూడు బాల్స్ తేడాతో ముంబై ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మను అవుట్ చేయడంతో ముంబై జట్టు 52/2 తో కష్టాల్లో పడినట్లు కనిపించింది.

రోహిత్ శర్మ అవుట్ పై మరోసారి వివాదం..

అయితే ఇక్కడే అసలు డ్రామా నడిచింది. రోహిత్ శర్మ అవుట్ పై ఐపీఎల్ లో మరోసారి వివాదం నెలకొంది. హస రంగ బౌలింగ్ లో ఫ్రంట్ ఫుట్ కి వచ్చిన రోహిత్ శర్మ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. అయితే అది కాస్త ప్యాడ్ కి తగిలింది. వెంటనే హాసరంగ అప్పీల్ చేశాడు. అయితే ఎంపైర్ నాట్ అవుట్ గా ప్రకటించాడు. రోహిత్ శర్మ చాలా దూరం క్రేజీ ముందుకు రావడంతో హాసరంగా రివ్యూ కి వెళ్లాలనుకోలేదు. అయితే ఆర్సిబి కెప్టెన్ డూ ప్లెసిస్ మాత్రం రివ్యూ తీసుకున్నాడు.

పప్పులో కాలేసిన థర్డ్ ఎంపైర్..

అయితే ఈ విషయంలో థర్డ్ ఎంపైర్ కూడా పప్పులో కాలేశాడు. రోహిత్ శర్మ ఎంత ఫ్రంట్ కి వచ్చాడో చూడకుండా కేవలం డిఆర్ఎస్ గుడ్డిగా డెసిషన్ ఇచ్చాడు. బాల్ ట్రాకింగ్ నేరుగా వికెట్లను తాకుతుండడంతో అవుట్ ఇచ్చాడు. దీంతో రోహిత్ శర్మకు ఏం జరిగిందో అర్థం కాలేదు. నిబంధనల ప్రకారం మూడు మీటర్ల కంటే వికెట్ల ముందుకు వస్తే అది ఎల్బీడబ్ల్యూ ఇచ్చే అవకాశం లేదు. కానీ, థర్డ్ ఎంపైర్ మాత్రం దాన్ని అవుట్ ఇచ్చాడు.

మండిపడుతున్న రోహిత్ అభిమానులు..

ఈ సీజన్ లో వరుసగా రెండోసారి కెప్టెన్ రోహిత్ శర్మకు ఇలా జరిగిందని అభిమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ లక్నోతో జరిగిన మ్యాచ్ లో క్యాచ్ కాకపోయినాప్పటికీ అవుట్ గా ప్రకటించారని, మళ్లీ తాజాగా అటువంటి పనే చేశారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్ ఎంపైర్లు, థర్డ్ ఎంపైర్ రోహిత్ శర్మపై కక్షగట్టారని అభిమానులు పేర్కొంటున్నారు. దీనిపై ముంబై ఫ్యాన్స్ తో పాటు కైఫ్, మునాఫ్ పటేల్ లాంటి మాజీ ఆటగాళ్లు సైతం ప్రశ్నిస్తున్నారు. ముంబై డగౌట్ కూడా ఈ నిర్ణయం పట్ల షాక్ అయింది.

Exit mobile version