
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లను అలర్ట్ చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఆధార్ పాన్ లింక్ గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు గడువును పొడిగించిన కేంద్రం తాజాగా మరోమారు గడువును పొడిగించింది. కరోనా నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీంతో ఎస్బీఐ కస్టమర్లకు కీలక సూచనలు చేసింది.
ఖాతాదారులు నిరంతర సేవలను పొందడం కోసం తమ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోవాలని ఎస్బీఐ సూచనలు చేసింది. www.incometax.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి లింక్ ఆధార్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయడం ద్వారా సులభంగా పాన్ కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేయడం సాధ్యమవుతుంది. ఇప్పటికే పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో తెలుసుకోవాలనుకునే వారు కొన్ని సింపుల్ టెక్నిక్స్ ద్వారా ఆ విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఆధార్ పాన్ లింక్ గురించి తెలుసుకోవాలని అనుకునే వాళ్లు https://www1.incometaxindiaefiling.gov.in/e-filinggs/services/aadhaarpreloginstatus.html వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత పేజీ ఓపెన్ కాగానే పాన్, ఆధార్ అనే రెండు బాక్సులు కనిపిస్తాయి. పాన్ అని ఉన్న బాక్సులో పాన్ నెంబర్‌ను, ఆధార్ నెంబర్ బాక్సులో ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత వ్యూ లింక్ ఆధార్ స్టేటస్‌పై క్లిక్ చేస్తే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ తో లింక్ అయిన వాళ్లకు యూవర్ పాన్ లింక్‌డ్ టు ఆధార్ నెంబర్ అని చూపిస్తుంది. ఈ విధంగా సులభంగా ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ తో లింక్ అయిందో లేదో తెలుసుకునే అవకాశం ఉంటుంది