Banana Juice Benefits: ఈ రోజుల్లో గుండె జబ్బులు కామన్ గా మారిపోయాయి. చిన్న వయసులోనే హృద్రోగ సమస్యలు వేధిస్తున్నాయి. మన ఆహార అలవాట్లే మనకు జబ్బులు వచ్చేలా చేస్తున్నాయి. కానీ మనం మాత్రం మన అలవాట్లను మార్చుకోవడం లేదు. మంచి ఆహారాలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో గుండె జబ్బుల ముప్పు నుంచి తప్పించుకునే దారులు మాత్రం వెతకడం లేదు.
గుండె పోటు వస్తే ఆస్పత్రికి వెళ్లడం స్టంట్లు వేయించుకోవడం మళ్లీ యథావిధిగా అన్ని లాగించేయడం చేస్తున్నారు. ఎవరు కూడా కేర్ తీసుకోవడం లేదు. తనకు గుండెపోటు వచ్చింది జాగ్రత్తగా ఉండాలనే భావన ఎవరిలో కలగడం లేదు. దీంతో మందులు వేసుకోవడం ఏది పడితే అది తినడం చేస్తున్నారు. గుండె జబ్బులు రాకుండా చేయడంలో అరటికాయ ఎంతో ఉపయోగపడుతుంది.
అరటికాయను ముక్కలుగా కట్ చేసుకుని అందులో కాస్త పెరుగు వేసుకుని ఇంకా సైంధవ లవణం కాని గల్ల ఉప్పు కాని వేసుకుని మిక్సీ పట్టుకుని రోజు ఉదయం, సాయంత్రం రెండు పూటలు ఒక నెల రోజుల పాటు తీసుకుంటే గుండె జబ్బు ఉంటే నయమవుతుంది. లేని వారికి రాకుండా ఉంటుంది. ఇదో అద్భుతమైన చిట్కా. దీన్ని వాడుకుని హృద్రోగ సమస్యల నుంచి బయట పడాలని సూచిస్తున్నారు.
ఇది సులభమైన చిట్కానే. సింపుల్ రెమెడీ. ఇంట్లోనే తయారు చేసుకుని ఫలితం పొందొచ్చు. మనసుంటే మార్గముంటది. చేయాలనుకుంటే ఇది చేసుకుని గుండె జబ్బుల నుంచి ఉపశమనం పొందాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బు వస్తే చాలా ప్రమాదకరం. సమయానికి చికిత్స అందకపోతే ప్రాణాలు పోవడం జరుగుతుంది. అందుకే జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోవాలి