Banana Health Benefits: అరటిపండు ఇలా తింటే అర్షమొలలు ఇక రావు అంతే

పొరపాటున కూడా అల్పాహారంలో అరటిపండు తినొద్దు. దీన్ని ఏదైనా తిన్న తరువాత తినాలి. అంతేకాని ఉదయాన్నే పరగడుపున తినడం వల్ల మనకు ఇతర సమస్యలు వస్తాయి.

Written By: Srinivas, Updated On : May 13, 2023 3:10 pm

Banana Health Benefits

Follow us on

Banana Health Benefits: ప్రస్తుత కాలంలో చాలా మందిలో ఫైల్స్ (అర్షమొలలు) సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. దీంతో వారు ఏం చేయలేకపోతున్నారు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలు కూడా ఉంటాయి. ఎంతటి పెద్ద రోగాన్నయిని ఇట్టే తగ్గించే సామర్థ్యం ఉన్న పండ్లు ఉన్నాయి. అందులో అరటి పండు ఒకటి. ఇందులో ఉండే పోషకాలతో దీన్ని తినడం వల్ల మనకు చాలా రకాల ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ తో మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.

ఇందులో ఉండే డైటరీ ఫైబర్ వల్ల పేగుల్లో కదలికలు పెంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. పొటాషియం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పోషకాలు ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియకు సాయపడుతుంది. పూర్తిగా పండిన దాన్ని తీసుకుంటేనే మేలు. బాగా జీర్ణం చేస్తుంది. అదే అరటికాయను తీసుకుంటే దాని వల్ల మనకు అజీర్తి సమస్య ఏర్పడవచ్చు. అందుకే మగ్గిన అరటిపండును తీసుకుంటేనే మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు.

పొరపాటున కూడా అల్పాహారంలో అరటిపండు తినొద్దు. దీన్ని ఏదైనా తిన్న తరువాత తినాలి. అంతేకాని ఉదయాన్నే పరగడుపున తినడం వల్ల మనకు ఇతర సమస్యలు వస్తాయి. మరి ఎప్పుడు తినాలంటే సాయంత్రం సమయంలో తినడం బెటర్. సాయంకాలం పూట స్నాక్స్ తీసుకునే సమయంలో అరటి పండ్లు తినడం ఉత్తమం. దీని వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది.

ఇలా అరటిపండు సాయంతో ఫైల్స్ సమస్యను దూరం చేసుకోవచ్చు. ఫైల్స్ సమస్య పెరిగితే ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే అరటిపండును తిని మన ఫైల్స్ సమస్యను పోగొట్టుకోవాలి. అరటిపండులో అంతటి శక్తి ఉంటుంది. పోషకాలు మెండుగా ఉండటంతో నే చాలా మంది వీటిని తింటారు. మధుమేహం ఉన్న వారు వీటిని తీసుకోవడం వల్ల నష్టం జరుగుతుంది. అందుకే వారు అరటిపండ్లకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం.