Homeప్రత్యేకంకిడ్నీల్లో రాళ్ళతో బాధ పడుతున్నారా.. తినకూడని ఆహారాలివే..?

కిడ్నీల్లో రాళ్ళతో బాధ పడుతున్నారా.. తినకూడని ఆహారాలివే..?

Kidney Stones
photo flat lay or top view very small kidney stone at two finger at blue background

ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని కిడ్నీలో రాళ్ల సమస్య వేధిస్తోంది. ఈ సమస్య బారిన పడితే నొప్పి తీవ్రంగా ఉంటుంది. కిడ్నీలో రాళ్ల సమస్యకు మందులు వాడి చెక్ పెట్టవచ్చు. అయితే సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం ఆపరేషన్ చేసి కిడ్నీలో రాళ్లను తొలగించాల్సి ఉంటుంది. కొంతమందికి ఈ సమస్య తగ్గినట్టే తగ్గి మళ్లీ వేధిస్తూ ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ బారిన పడినా, ఆ సమస్య పునరావృతం కాకూడదన్నా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి.

Also Read: జుట్టు ఎక్కువగా రాలుతోందా.. చేయకూడని పొరపాట్లు ఇవే..?

నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా శరీరంలోని కాల్షియం, ఆక్సలేట్ లేదా భాస్వరం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని కిడ్నీలో యూరిక్ యాసిడ్ ఏర్పడటం కూడా కిడ్నీలో స్టోన్స్ కు కారణమని తెలిపింది. కిడ్నీ స్టోన్స్ సమస్యలు రాకూడదన్నా, ఇప్పటికే కిడ్నీ స్టోన్స్ తో బాధ పడుతున్నా కొన్ని ఆహారాల జోలికి అస్సలు వెళ్లకూడదు. కిడ్నీ స్టోన్స్ తో బాధ పడేవాళ్లు బచ్చలికూర తీసుకోకూడదు.

Also Read: అల్లం వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?

బచ్చలికూరలో ఉండే ఆక్సలేట్ రక్తంలోని కాల్షియంతో కలిసిపోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆక్సలేట్ కంటెంట్ ఎక్కువగా ఉండే బీట్‌రూట్, ఓక్రా, బెర్రీస్, కంద దుంప, టీ, చాక్లెట్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ప్రోటీన్ అధికంగా ఉండే రెడ్ మీట్, పాలు, పాల ఉత్పత్తులు , చేపలు , గుడ్లు కూడా ఎక్కువగా తీసుకున్నా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

సోడియం అధికంగా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. నిల్వ ఉండే ఆహారం , ఉప్పు ఉన్న చిప్స్ ను తక్కువగా తీసుకుంటే మంచిది. కూల్ డ్రింక్స్ లో ఉండే పాస్పేట్ కూడా కిడ్నీల్లో రాళ్లకు కారణమవుతుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version