ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని కిడ్నీలో రాళ్ల సమస్య వేధిస్తోంది. ఈ సమస్య బారిన పడితే నొప్పి తీవ్రంగా ఉంటుంది. కిడ్నీలో రాళ్ల సమస్యకు మందులు వాడి చెక్ పెట్టవచ్చు. అయితే సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం ఆపరేషన్ చేసి కిడ్నీలో రాళ్లను తొలగించాల్సి ఉంటుంది. కొంతమందికి ఈ సమస్య తగ్గినట్టే తగ్గి మళ్లీ వేధిస్తూ ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ బారిన పడినా, ఆ సమస్య పునరావృతం కాకూడదన్నా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి.
Also Read: జుట్టు ఎక్కువగా రాలుతోందా.. చేయకూడని పొరపాట్లు ఇవే..?
నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా శరీరంలోని కాల్షియం, ఆక్సలేట్ లేదా భాస్వరం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని కిడ్నీలో యూరిక్ యాసిడ్ ఏర్పడటం కూడా కిడ్నీలో స్టోన్స్ కు కారణమని తెలిపింది. కిడ్నీ స్టోన్స్ సమస్యలు రాకూడదన్నా, ఇప్పటికే కిడ్నీ స్టోన్స్ తో బాధ పడుతున్నా కొన్ని ఆహారాల జోలికి అస్సలు వెళ్లకూడదు. కిడ్నీ స్టోన్స్ తో బాధ పడేవాళ్లు బచ్చలికూర తీసుకోకూడదు.
Also Read: అల్లం వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?
బచ్చలికూరలో ఉండే ఆక్సలేట్ రక్తంలోని కాల్షియంతో కలిసిపోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆక్సలేట్ కంటెంట్ ఎక్కువగా ఉండే బీట్‌రూట్, ఓక్రా, బెర్రీస్, కంద దుంప, టీ, చాక్లెట్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ప్రోటీన్ అధికంగా ఉండే రెడ్ మీట్, పాలు, పాల ఉత్పత్తులు , చేపలు , గుడ్లు కూడా ఎక్కువగా తీసుకున్నా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
సోడియం అధికంగా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. నిల్వ ఉండే ఆహారం , ఉప్పు ఉన్న చిప్స్ ను తక్కువగా తీసుకుంటే మంచిది. కూల్ డ్రింక్స్ లో ఉండే పాస్పేట్ కూడా కిడ్నీల్లో రాళ్లకు కారణమవుతుంది.