https://oktelugu.com/

జూ. ఎన్టీఆర్ వైపు తెలుగు తమ్ముళ్ల చూపు?

పాయే.. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ ల పరువు పాయే.. నిజంగానే తెలుగు తమ్ముళ్లలో వీరిద్దరిపై నమ్మకం సడలుతోందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. చంద్రబాబు వయసు అయిపోవడం.. ఆయన చోటును లోకేష్ భర్తీ చేసే స్థాయిలో లేకపోవడంతో తమ్ముళ్లు ఇప్పుడు తెలుగు దేశం వ్యవస్థాపకులు నందమూరి తారకరామ రావు మనవడు జూ.ఎన్టీఆర్ వైపు మరులుతోంది. Also Read: కేసీఆర్ నిర్ణయం వెనుక కుట్ర: బండి సంజయ్ సంచలన ఆరోపణ తాజాగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో టీడీపీ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 28, 2020 / 08:39 PM IST
    Follow us on

    పాయే.. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ ల పరువు పాయే.. నిజంగానే తెలుగు తమ్ముళ్లలో వీరిద్దరిపై నమ్మకం సడలుతోందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. చంద్రబాబు వయసు అయిపోవడం.. ఆయన చోటును లోకేష్ భర్తీ చేసే స్థాయిలో లేకపోవడంతో తమ్ముళ్లు ఇప్పుడు తెలుగు దేశం వ్యవస్థాపకులు నందమూరి తారకరామ రావు మనవడు జూ.ఎన్టీఆర్ వైపు మరులుతోంది.

    Also Read: కేసీఆర్ నిర్ణయం వెనుక కుట్ర: బండి సంజయ్ సంచలన ఆరోపణ

    తాజాగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. జిల్లా టీడీపీ నేతలతోపాటు జూ.ఎన్టీఆర్ కు స్థానం కల్పించి తారక్ నెక్ట్స్ సీఎం అన్న క్యాప్షన్ ఇచ్చి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వైరల్ అవుతోంది.

    ఇప్పుడు తెలుగుదేశంలోని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో దీన్ని హోరెత్తిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటు చంద్రబాబు, ఇటు లోకేష్ లు దీనిపై ఎక్కడా కంట్రోల్ చేయడం లేదు.

    Also Read: అపచారం.. తిరుమలలో సీఎం రమేశ్ ఏంటి పని?

    ఇప్పటికే జగన్ ధాటికి టీడీపీ తట్టుకోలేకపోతోంది. అంతగా పోటీ ఇవ్వలేకపోతోంది. టీడీపీ మీడియా ఎంత లేపుదామని చూస్తున్నా లేవడం లేదు. దీంతో ఇక ఎన్టీఆరే తెలుగు దేశం పార్టీకి దిక్కు అని తెలుగు తమ్ముళ్లు భావిస్తూ ఆయన పేరును తెరపైకి తెస్తున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని ఏ టీడీపీ సీనియర్ నేతలు ఖండించడం లేదు. ఎందుకంటే లోకేష్ కంటే ఎన్టీఆర్ నూరు పాళ్లు బెటర్ అని అందరికీ తెలుసు. చంద్రబాబు, లోకేష్ లే ఆయనను రానీయడం లేదని తెలుసు. అందుకే కొత్తగా ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చినా అందరూ కుక్కిన పేనులా ఉంటున్నారే తప్పితే అస్సలు బయటపడడం లేదు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్