Hands Shaking : ఫిట్, ఆరోగ్యకరమైన శరీరాన్ని పొందడానికి ప్రజలు వ్యాయామం చేస్తుంటారు. దీని కోసం జిమ్‌లో చాలా చెమటలు పట్టిస్తారు కూడా. కానీ కొన్నిసార్లు భారీ వర్కవుట్‌ల వల్ల కొందరికి చేతులు వణుకుతాయి. వ్యాయామం తర్వాత చేతులు వణకడం అనేది చాలా మందిలో ఒక సాధారణ సమస్య. వ్యాయామం మాత్రమే కాదు కొందరికి ఇతర పనులు చేసిన తర్వాత కూడా చేతులు వణుకుతుంటాయి. కొంత సమయం తర్వాత చేతులు వాటంతట అవే వణుకడం కూడా ఆగిపోతాయి. మరి ఇలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? దీని వల్ల ఎలాంటి సమస్యలు వచ్చే ఆస్కారం ఉందో తెలుసుకుందాం.
మనం వర్కవుట్ చేసినప్పుడు మన శరీరం చాలా కష్టపడాల్సి వస్తుంది. కండరాల కార్యకలాపాలు పెరిగినప్పుడు, లాక్టిక్ ఆమ్లం శరీరంలో పేరుకుపోతుంది. ఇది అలసట, తిమ్మిరికి కారణమవుతుంది. అంతేకాకుండా, అధిక-తీవ్రతతో కూడిన వ్యాయామాలు చేసినప్పుడు, శరీరం శక్తిని వినియోగిస్తుంది. గ్లూకోజ్ లోపం రావచ్చు. దీని వల్ల చేతులు వణకడం వంటి పరిస్థితి రావచ్చు.
గ్లూకోజ్ లోపం
వ్యాయామం సమయంలో శరీరం ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది. మీ శరీరంలో తగినంత కార్బోహైడ్రేట్లు (గ్లూకోజ్) లేకపోతే, అది బలహీనత, వణుకు వంటి సమస్యలను సృష్టిస్తుంది. కాబట్టి జాగ్రత్త.
ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత
వ్యాయామం చేసే సమయంలో చెమటలు పట్టడం వల్ల శరీరంలో సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్‌ల లోపం ఏర్పడుతుంది. వాటి లోపం వల్ల కండరాల తిమ్మిరి, వణుకు వస్తుంది. అందుకే జాగ్రత్త అవసరం. మీరు ఎక్కువ పని చేసినప్పుడు కూడా ఇదే సమస్య వస్తుంది. భారీ పనులు, శరీరానికి శ్రమ కలిగించే పనుల వల్ల ఈ సమస్యలు ఏర్పడతాయి కాబట్టి మీకు కావాల్సిన శక్తి మస్ట్ అని గుర్తు పెట్టుకోండి.
అలసిపోవాలి
అధిక బరువును ఎత్తడం ద్వారా, ఎక్కువసేపు ఇలా చేయడం వల్ల శరీర కండరాలు అలసిపోతాయి. కండరాలకు మెదడు నుంచి తగినంత సంకేతాలు అందవు. దీని వల్ల కండరాల సమస్యలు కూడా రావచ్చు.
ఏ విషయాలు గుర్తుంచుకోవాలి
సమతుల్య ఆహారం : వ్యాయామానికి ముందు, తర్వాత సరైన ఆహారం తీసుకోండి. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. కండరాలు సక్రమంగా పనిచేసేందుకు బలం లభిస్తుంది.
హైడ్రేషన్ : వ్యాయామం చేసేటప్పుడు, తర్వాత సరైన మొత్తంలో నీరు తాగడం చాలా ముఖ్యం. నీటితో పాటు, ఎలక్ట్రోలైట్స్ ఉన్న పానీయాలు కూడా ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుకోవడంలో ప్రయోజనకరంగా ఉంటాయి.
తగినంత నిద్ర : శరీరం కోలుకోవడానికి నిద్ర చాలా ముఖ్యం. మీకు తగినంత నిద్ర లేకపోతే, వ్యాయామం తర్వాత కండరాలు పూర్తిగా కోలుకోలేవు, ఇది వణుకు సమస్యకు దారితీస్తుంది. సో జాగ్రత్త.