America : అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న 104 మంది భారతీయులను సి -17 సైనిక విమానం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ ప్రాంతంలో ల్యాండ్ అయింది. ఇటీవల కొలంబియా దేశస్థులను కూడా సైనిక విమానంలో తరలించారు. దానిపై కొలంబియా దేశ అధ్యక్షుడు గుస్తావ్ పెట్రో అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ దేశస్తులను సివిల్ ఫ్లైట్లలోనే తీసుకురావాలని.. అలా అయితేనే ఆమోదం చెబుతామని అన్నారు. దీనిపై ట్రంప్ మండిపడ్డారు. పెనాల్టీలు, టారిఫ్ లు విధిస్తామని హెచ్చరించడంతో గుస్తావ్ వెనక్కి తగ్గక తప్పలేదు.
అందుకోసమే వాడుతున్నారట
జనవరి 20న ట్రంప్ బాధితుల స్వీకరించారు.. అమెరికా సైన్యం సరిహద్దులను పరిరక్షిస్తుందని వెంటనే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సిద్ధం చేశారు. దీంతో అప్పటి తాత్కాలిక రక్షణ శాఖ మంత్రి రాబర్ట్ సెల్సెస్ స్పందించారు.. హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి అమెరికా సైన్యం సహాయం చేస్తుందని పేర్కొన్నారు. ఈ రెండు విభాగాలను అమెరికా దక్షిణ భాగంలో కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఆధీనంలో ఉంచామని వివరించారు. విదేశాంగ శాఖ ఆయా దేశాల నుంచి అనుమతి పొందిన తర్వాత విమానాలు ఒకదాని తర్వాత ఒకటి బయలుదేరుతాయి. అయితే అక్రమంగా ఉంటున్న వారిపై దాడులను గుర్తు చేసే విధంగా తాము సైనిక విమానాలను వినియోగిస్తున్నామని రాబర్ట్ సెల్సెస్ ప్రకటించారు. అమెరికాలో అక్రమ వలసదారులను తమ మాతృదేశాలకు పంపడానికి ఇప్పటివరకు కేవలం ఆరు సైనిక రవాణా విమానాలు మాత్రమే వినియోగిస్తున్నారు. అయితే సైనికేతర విమానాలను కూడా అమెరికా ఉపయోగిస్తున్నది. అయితే వీటిని సమీపంలో ఉన్న మెక్సికో, గ్వాటే మాల, కొలంబియా, హూండు రాస్ వంటి దేశస్థులను తరలించడానికి ఉపయోగించింది. ఇక అమెరికా కష్టంస్ అండ్ ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ (ECE) విమానాలతో పోల్చి చూస్తే సీ -17 విమానాలనే అధికంగా ఉపయోగిస్తున్నది. అమెరికా రక్షణ విభాగంలో సీ -17 గ్లోబ్ మాస్టర్ విమానాలు ఎక్కువగా ఉంటాయి. వీటి విలువ 75.8 బిలియన్ డాలర్లు.. ఘనా, టాంజానీయా, శ్రీలంక దేశాల జిడిపి కంటే చాలా ఎక్కువ.. ఒక్కో విమానం ఖరీదు దాదాపు 340 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. అమెరికా దగ్గర దేశాలు ఈ రకమైన విమానాలను వాడుతుంటాయి.. యూకే, యునైటెడ్ అరబ్ ఎమైరైట్స్, కువైట్, ఇండియా, ఖతార్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఈ విమానాలను వాడుతున్నాయి.. ప్రపంచవ్యాప్తంగా ఈ విమానాలు 275 వరకు ఉంటే.. ఇందులో 223 అమెరికా వద్దే ఉన్నాయి. ఈ మిల్ట్రీ విమానంలో ఒక వ్యక్తిని అమెరికా నుంచి వారి సొంత దేశాలకు పంపడానికి దాదాపు నాలుగు లక్షల వరకు ఖర్చవుతుంది.. అమెరికా బిజినెస్ క్లాస్ విమానంలో ఫస్ట్ క్లాస్ టికెట్లు గనుక పంపితే 853 డాలర్లు మాత్రమే సరిపోతాయి.. చార్టర్డ్ విమానాల కంటే సైనిక విమానాలు చాలా ఖరీదైనవి.. ఈ విమానం పై గంటకు 17వేల డాలర్ల చొప్పున ఒక్కొక్కరిపై 630 డాలర్లు ఖర్చవుతుంది. అదే సీ -17 అయితే గంటకు 28,500 డాలర్లు ఖర్చు అవుతుంది.. ఈ ఖర్చు గ్వాటెమాల వరకు మాత్రమే.. భారత్ కు అయితే ఈ ఖర్చు మరింత అధికంగా ఉంటుంది.