Sleeping: ప్రస్తుత కాలంలో ఎంతో మంది యువత కాలంతోపాటు పరుగులు తీస్తూ.. వారి శరీరానికి సరైన నిద్ర, ఆహారాలను మానేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇకపోతే ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ కి అలవాటుపడి అర్ధరాత్రి వరకు సెల్ ఫోన్ లో కాలక్షేపం చేస్తున్నారు. ఈక్రమంలోనే రాత్రుళ్లు ఎక్కువసేపు మేలుకొని ఉదయం ఎంతో ఆలస్యంగా నిద్ర లేస్తున్నారు. ఇలా ఉదయం చాలా ఆలస్యంగా లేవడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు బారిన పడే అవకాశాలు ఉన్నాయని తాజాగా బ్రిఘం యంగ్ యూనివర్శిటీ ఆఫ్ అమెరికా కొత్త అధ్యయనం పేర్కొంది.
ఇలా శరీరంలో అధిక మొత్తంలో కొలెస్ట్రాల్ పేరుకోవడం వల్ల అధిక శరీర బరువు పెరగడమే కాకుండా గుండెకు రక్తప్రసరణ వ్యవస్థలో ఆటంకాలు ఏర్పడే గుండె పోటు సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక రోజుకు తొమ్మిది నుంచి పదకొండు గంటలు నిద్రపోయే వారిలో దాదాపు 40 శాతం గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు ఈ పరిశోధనలో వెల్లడించారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క యువత అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోని యువత ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి తగినంత నిద్రపోతూ ప్రొటీన్లు కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.