https://oktelugu.com/

వాడిన వంటనూనెను మళ్లీ వాడుతున్నారా.. ప్రాణాలకే రిస్క్..?

దేశంలో ఎక్కువ సంఖ్యలో ఆహార భద్రతా అధికారులు ఉన్న నగరంగా తమిళనాడు రాష్ట్రానికి పేరు ఉంది. అయితే ఈ నగరంలో ఆహార పదార్ధాల కల్తీ యధేచ్చగా జరుగుతుండటం గమనార్హం. సాధారణంగా హోటళ్లు, క్యాంటీన్లలో ఒకసారి వినియోగించిన నూనెను సబ్బులు తయారీ, బాయిలర్ కు ఇంధనంగా వినియోగించడం జరుగుతుంది. అయితే కొంతమంది ఆ నూనెను కొనుగోలు చేసి తిరిగి ప్యాకింగ్ చేసిన తరువాత వంటనూనెగా వినియోగిస్తున్నారు. ఒకసారి వినియోగించిన వంటనూనెను మళ్లీ వినియోగిస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 2, 2021 / 08:12 AM IST
    Follow us on

    దేశంలో ఎక్కువ సంఖ్యలో ఆహార భద్రతా అధికారులు ఉన్న నగరంగా తమిళనాడు రాష్ట్రానికి పేరు ఉంది. అయితే ఈ నగరంలో ఆహార పదార్ధాల కల్తీ యధేచ్చగా జరుగుతుండటం గమనార్హం. సాధారణంగా హోటళ్లు, క్యాంటీన్లలో ఒకసారి వినియోగించిన నూనెను సబ్బులు తయారీ, బాయిలర్ కు ఇంధనంగా వినియోగించడం జరుగుతుంది. అయితే కొంతమంది ఆ నూనెను కొనుగోలు చేసి తిరిగి ప్యాకింగ్ చేసిన తరువాత వంటనూనెగా వినియోగిస్తున్నారు.

    ఒకసారి వినియోగించిన వంటనూనెను మళ్లీ వినియోగిస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. పొయ్యి మీద నూనెను వేడి చేయడం వల్ల నాణ్యత లోపించే అవకాశం  ఉంటుంది. అలాంటి నూనెను వినియోగించడం వల్ల శరీరానికి ఎటువంటి పోషకాలు లభించే అవకాశం అయితే ఉండదని చెప్పవచ్చు. వాడిన వంటనూనెను మళ్లీ వాడితే ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.

    కొంతమంది వ్యాపారులు వాడిన వంటనూనెను కొనుగోలు చేసి తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఏబీసీడీ అని నాలుగు రకాలుగా వర్గీకరించి కల్తీ వ్యాపారులు వంటనూనెను విక్రయిస్తుండటం గమనార్హం. మొదట 190 రూపాయలకు వంటనూనెను కొనుగోలు చేసే దాన్ని 100 రూపాయలకు విక్రయిస్తున్నారు. 100 రూపాయల వంటనూనెను 70 రూపాయలకు విక్రయిస్తున్నారు. 70 రూపాయల వంటనూనెను 30 రూపాయలకు విక్రయించడం జరుగుతోంది.

    వాడిన నూనెను మళ్లీ వాడటం వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా వస్తున్నాయి. వాడిన నూనెను మళ్లీ వాడితే శరీరానికి ఎటువంటి పోషకాలు లభించవు.