ఏపీలోని ప్రభుత్వ విభాగంలో జాబ్స్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 49 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగ ఖాళీలలో 32 ఖాళీలు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ కానుండగా 17 ఉద్యోగ ఖాళీలు లేటరల్ ఎంట్రీ ద్వారా భర్తీ కానుండటం గమనార్హం. ఎమర్జెన్సీ మెడిసిన్, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, యూరాలజీ, రేడియో డయాగ్నసిస్/రేడియాలజీ విభాగాలలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఆన్‌లైన్‌ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు […]

Written By: Navya, Updated On : August 3, 2021 6:12 pm
Follow us on

డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 49 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగ ఖాళీలలో 32 ఖాళీలు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ కానుండగా 17 ఉద్యోగ ఖాళీలు లేటరల్ ఎంట్రీ ద్వారా భర్తీ కానుండటం గమనార్హం. ఎమర్జెన్సీ మెడిసిన్, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, యూరాలజీ, రేడియో డయాగ్నసిస్/రేడియాలజీ విభాగాలలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

ఆన్‌లైన్‌ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగష్టు 11వ తేదీ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. https://dme.ap.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎండీ, ఎం.ఎస్, ఎండీఎస్, డీఎం, డీఎన్బీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

జులై 27 నాటికి 42 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, దివ్యాంగులకు పది సంవత్సరాలు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉండే అవకాశం ఉంటుంది. మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 1500 రూపాయలుగా ఉంది.

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజులో 500 రూపాయలు రాయితీ ఉంటుంది. వాళ్లు కేవలం 1,000 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. దరఖాస్తు చేసుకునే సమయంలో నోటిఫికేషన్ లో ఉన్న ధృవపత్రాలను అప్లోడ్ చేయాలి. నోటిఫికేషన్ ను చదవడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.