https://oktelugu.com/

Mosquito: దోమలు బెడదను తగ్గించడానికి వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

ఇంట్లో పెరిగిన దోమలను తగ్గించడానికి కొందరు ఆల్‌ఔట్ లేదా కాయిల్స్ వంటివి కాలుస్తుంటారు. దోమలు తగ్గించుకోవడానికి ఇవి వాడుతున్నారని అందరూ అనుకుంటారు. కానీ వీటిని పీల్చడం వల్ల ఆయుషు తగ్గుందనే విషయం మాత్రం తెలుసుకోరు. వీటి నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 9, 2024 / 03:17 AM IST

    Mosquito Bite

    Follow us on

    Mosquito: సీజన్‌తో సంబంధం లేకుండా దోమలు ఇంట్లో పెరిగిపోతుంటాయి. వీటివల్ల మలేరియా, డెంగ్యూ వంటివి కూడా వస్తాయి. అయితే ఇవి చాలా ప్రమాదకరమైనవి. వీటివల్ల కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోతారు. ఇవి దోమల ద్వారా సంక్రమణ చెందుతాయి. అయితే ఇంట్లో పెరిగిన దోమలను తగ్గించడానికి కొందరు ఆల్‌ఔట్ లేదా కాయిల్స్ వంటివి కాలుస్తుంటారు. దోమలు తగ్గించుకోవడానికి ఇవి వాడుతున్నారని అందరూ అనుకుంటారు. కానీ వీటిని పీల్చడం వల్ల ఆయుషు తగ్గుందనే విషయం మాత్రం తెలుసుకోరు. వీటి నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దోమలు తగ్గించుకోవడానికి సహజంగా ఉండే చిట్కాలు పాటించాలి. కానీ ఇలాంటి రసాయనాలు ఉండే వాటిని వాడటం వల్ల ఇంకా ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా పిల్లలు ఉన్న దగ్గర అయితే అసలు వీటిని వాడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    ఇంట్లో దోమలు ఉండకూడదంటే సహజ చిట్కాలు పాటించండి. ఇంట్లో మూలలు కర్పూరాన్ని పెట్టండి. వీటి వాసనకి దోమల బెడద తగ్గుతుంది. అలాగే దోమలు కాటు వేయకుండా చర్మానికి నిమ్మ యూకలిప్టస్ నూనెను వాడండి. ఇవి తప్పకుండా దోమలు కాటు వేయకుండా చూస్తాయి. అలాగే బయటకు వెళ్లినప్పుడు దోమలు కరవకుండా సరైన దుస్తులు ధరించండి. షార్ట్ డ్రస్సులు కాకుండా శరీరం మొత్తం కప్పి ఉంచేలా దుస్తులు ధరించడం వల్ల దోమ కాటును నివారించవచ్చు. నీరు నిల్వ ఉంటే దోమలు వ్యాప్తి చెందుతాయి. ఇంట్లో ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే తొలగించండి. ముఖ్యంగా పూల కుండీలు, కంటైనర్లను ఖాళీ చేయండి. అలాగే నిద్రపోయేటప్పుడు దోమతెరలను వాడండి. సాయంత్రం పూట బయటకు వెళ్లడాన్ని తగ్గించండి. వర్షాలకు బయట దోమలు ఎక్కువ అవుతాయి. దీంతో మీకు కాటు వేస్తాయి.

    ఇంట్లోకి దోమలు రాకుండా తలుపులు, కిటికీలకు చిన్న తెరలను వాడండి. జ్వరం, దగ్గు, జలుబు వంటి ఏ చిన్న లక్షణం కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. లేకపోతే ప్రమాదం తప్పదు. ఇంట్లో కాయిల్స్‌, దోమల మందు వాడకుండా ఇంటి బయట వాటిని వాడండి. వర్షాకాలంలో గోడలపై తేమ ఉంటుంది. వీటిని క్లీన్ చేయండి. సరదాగా కూడా వర్షంలో తడవద్దు. బయట ఫుడ్‌కి దూరంగా ఉండటం మంచిది. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. అలాగే మాస్క్ వాడండి. ఈ కాలంలో కేవలం గోరువెచ్చని నీరు మాత్రమే తాగండి. చల్లని నీటికి దూరంగా ఉండండి. జలుబు చేసే పదార్థాలను అతిగా తినకండి. జలుబు చేస్తే ఆటోమెటిక్‌గా వైరల్ ఫీవర్ వస్తుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు అనేవి తప్పనిసరి. లేకపోతే దోమలు పెరిగి మీరు అనారోగ్య సమస్యల బారిన పడతారు. దీంతో సమస్య తీవ్రం అయ్యి కొన్నిసార్లు ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.