Homeలైఫ్ స్టైల్Winter Season: శీతాకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఫుడ్ తినాల్సిందే!

Winter Season: శీతాకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఫుడ్ తినాల్సిందే!

Winter Season: చలికాలం వచ్చేసింది. ప్రస్తుతం అన్ని చోట్ల చలి తీవ్రత పెరిగిపోయింది. బయట వాతావరణంలోనే కాకుండా ఇంట్లో ఉన్నా కూడా చలి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు కూడా చాలా తక్కువ అయ్యాయి. ఏ సమయంలో బయటకు వెళ్లిన కూడా చల్లని గాలులు వీస్తాయి. చలి వల్ల చాలా మందికి జలుబు, దగ్గు వంటివి వస్తాయి. దీనికి తోడు ఇంట్లో కూడా చల్లగా ఉండటం వల్ల సీజనల్ సమస్యలు తొందరగా వస్తాయి. ఈ సమస్యల నుంచి విముక్తి చెందాలంటే పోషకాలు ఉండే ఆరోగ్యమైన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సీజన్‌లో దొరికే ఫుడ్ అయితే తప్పకుండా తీసుకుంటేనే ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే సీజనల్‌గా దొరికే ఫుడ్స్‌లో కొందరికి టర్నిప్ గురించి పెద్దగా తెలియదు. శీతాకాలంలో లభించే ఇది ఒక కూరగాయ. దీన్ని శాల్గం అని కూడా అంటారు. ఈ ఫుడ్‌ను శీతాకాలంలో తినడం వల్ల ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయట. మరి అవేంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

శీతాకాలంలో లభించే టర్నిప్‌ చూడటానికి లేత తెలుపు, ఎరుపు రంగులో ఉంటుంది. దీని రుచి ముల్లంగిలా ఉంటుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. ఇందులోని విటమిన్ సి, కాల్షియం, ఫైబర్‌తో పాటు ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి అనేక వ్యాధుల నుంచి విముక్తి చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. టర్నిప్‌లో విటమిన్ సితో పాటు ఫోలేట్, ఇనుము, కాల్షియం, ఫైబర్ కూడా ఉన్నాయి. ఇవి మలబద్ధకం వంటి సమస్యల నుంచి విముక్తి కలిగించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి కూడా టర్నిప్ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని కట్ చేసి ఉప్పుతో తినడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. శీతాకాలంలో తప్పకుండా ఈ ఫుడ్‌ను యాడ్ చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

తినే ఫుడ్‌లో ఫైబర్ లేకపోవడం వల్ల చాలా మంది మలబద్ధకం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇది కాస్త చివరకు పైల్స్‌గా మారుతుంది. ఇలాంటి సమస్యల ఉన్నవారు డైలీ టర్నీప్‌ను డైట్‌లో యాడ్ చేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందుతారని నిపుణులు చెబుతున్నారు. అలాగే బీపీ రోగులకు కూడా బాగా సహాయపడుతుంది. ఈ టర్నిప్‌ను తినడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ఇందులోని నైట్రేట్ రక్తపోటును నియంత్రించడంలో ఫస్ట్ ఉంటుంది. అలాగే ఈ టర్నిప్ కళ్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఇది కేవలం సీజనల్‌గా మాత్రమే లభిస్తుంది. కొందరు దీన్ని తినడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ డైలీ వీటిని తినడం వల్ల దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ టర్నిప్ ఎప్పుడైనా మీరు తిన్నారా? మీ ఏరియాలో లభ్యమవుతుందా? లేదా? కామెంట్ చేయండి.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version