
కరోనా మహమ్మారి విజృంభణ తరువాత ప్రజల జీవితంలో మాస్క్ భాగమైపోయింది. వైరస్ బారిన పడకుండా ఉండాలెని ఉద్దేశంతో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ మాస్క్ ను వినియోగిస్తున్నారు. ఫేస్ మాస్క్, ఫేస్ షీల్డ్ కరోనా వైరస్ బారిన పడకుండా రక్షిస్తున్నాయి. అయితే మనం ఎక్కువగా వినియోగించే క్లాత్ మాస్క్ ల గురింకి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ మాస్క్ లపై పరిశోధనలు చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కరోనా వైరస్ సోకకుండా ప్రపంచ దేశాల్లో చాలామంది క్లాత్ మాస్క్ లను వినియోగిస్తున్నారని అయితే క్లాత్ మాస్క్ లను వినియోగించే వాళ్లు వాటిని తరచూ శుభ్రం చేయడం లేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఎవరైతే ఇలా వాష్ చేయకుండా క్లాత్ మాస్క్ ను వినియోగిస్తారో వారికి కరోనా వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మాస్క్ శుభ్రం చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
క్లాత్ మాస్క్ లను ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న నీటిలో శుభ్రం చేస్తే మంచిదని పేర్కొన్నారు. వేడి నీటితో శుభ్రం చేసిన మాస్క్ లను తరచూ వాడటం ద్వారా కరోనా వైరస్ రిస్క్ ను తగ్గించుకోవచ్చని వెల్లడించారు. కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా గురించి అనేక వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. మహమ్మారి సోకితే చాలా నెలల పాటు ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది.
మరోవైపు ఏపీ, తెలంగాణలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఏపీలో నిన్న ఒక్కరోజే 3,224 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో 7,58,951 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండటం శుభ పరిణామమని చెప్పాలి.